ఎబివిపి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటి రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయింపు
ఎబివిపి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటి రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయింపు
నల్లగొండలోని పానగల్ రోడ్డులో ఎల్లమ్మ గుడి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహానికి సంబంధించిన ఎకరం భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయించడం జరిగిందని రిజిస్ట్రార్ ఈ అంశం నా పరిధిలో లేదని విసీ పరిధిలో ఉందని చేతులు దులుపుకోవడం తో మండిపడ్డ విద్యార్థి నాయకులు విసి చాంబర్లో దుప్పట్ల తో విసీ గారు వచ్చేంత వరకు ఇక్కడే నిద్రపోతాం అని చెప్పి నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ యూనివర్సిటీ నాయకుడు పొట్టిపాక నాగరాజు గారు మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు నిద్రపోతున్నారని, యూనివర్సిటీ భూములను అక్రమంగా ఇతరులకు అప్పగిస్తూన్నారని మండిపడ్డారు. విసి గారు 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు యూనివర్సిటీ రాలేదని మండిపడ్డారు.విసి వచ్చేవరకు ఇక్కడే ఉంటామని అధికారులు తక్షణమే స్పందించాలని యూనివర్సిటీ భూములను యునివర్సిటీ కేటాయించాలని లేని ఎడల ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు విజ్ఞేష్, శివ, దయాకర్, ఛత్రపతి, శ్రీనివాస్,విప్లవ్,రవి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.*
Comments
Post a Comment