కోడిపుంజు అరెస్టు

 జగిత్యాల: హత్యకు కారణమైన కోడిపుంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి మరణంలో కోడిపుంజు పాత్ర కూడా ఉండడంతో పోలీసులో కస్టడీలోకి తీసుకున్నారు. మనిషి కోసుకుని తినే కోడిపుంజు.. మనిషిని చంపడమేంటి? పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే మరీ…


జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు ఓ కోడి పుంజును అరెస్ట్ చేశారు. స్టేషన్ లోనే దానికి దాన వేస్తూ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో ఇటీవల కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు పందెం రాయుళ్లు. పందెం కోసం సిద్ధం చేసిన కోడి పుంజుకు అమర్చిన కత్తి గుచ్చుకోవడంతో వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య(45)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్తయ్య హత్య కేసును విచారిస్తున్న క్రమంలో ఇందుకు కారణమైన కోడిపుంజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


*నేరాంగీకారం ఎలానో మరి..?* 


సాధారణంగా పోలీసులు నేరం జరిగిన తరువాత నిందితుల స్టేట్ మెంట్ రికార్డు చేస్తుంటారు. నేరాంగీకార పత్రం (కన్ఫెషన్ రిపోర్టు) కూడా నిందితులను అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. అయితే మాటలు రాని కోడిపుంజు స్టేట్ మెంట్ ను పోలీసులు ఎలా రికార్డు చేస్తారోనన్న చర్చ సాగుతోంది. కోడిపుంజు నోటి వెంట వచ్చే కొక్కరకో భాషను పోలీసులు నేర్చుకుంటారేమోనని చలోక్తులు విసురుతున్నారు కొందరు. ఏదిఏమైనా హత్య కేసులో కోడిపుంజు అక్యూజ్‌డ్‌గా మారిన విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్