ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే --మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి

 




 ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలుపు బీజేపీదే --మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి

            ప్రభుత్వానికి  అనివర్గాల వారుదూరమైనారని,  ప్రజలంతా అధికార పార్టీ పై,  ప్రభుత్వం పై   ఆగ్రహం తో ఉన్నారని  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే నని  ఉమ్మడి  నల్గొండ జిల్లా mlc ఎన్నికల ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  జిల్లా బీజేపీ అధ్యక్షుడు  కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్యక్షతన నల్గొండ జిల్లా కార్యాలయంలో    జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల బిజిపి  పోలింగ్ బూత్ కన్వీనర్ వర్క్ షాప్ సమావేశంలో  ఆయన మాట్లాడుతూ బూత్ కన్వీనర్ లు నాయకులు సమిష్టి గా కృషి చేయాలని, గెలుపు బీజేపీదే నని అన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి  మాట్లాడుతూ బీజేపీ పరంపర  మొదలయిందని దుబ్బాక , జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించిందని, కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు గెలుపు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్  పోలింగ్ బూత్ కన్వీనర్ లకు వర్కు షాప్ నిర్వహించారు. మండలాల వారిగా, పట్టణాల వారిగా సమావేశాలు నిర్వహించి పని విభజన చేసి ఓటర్లను కలవని అయన కోరారు.  రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి  మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రాజనికుమారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల  నర్సింహారెడ్డి, పల్లెబోయిన శ్యామసుందర్, రాష్ట్ర  మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి,  మాజీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేకేర్, వంగాల స్వామి గౌడ్,  నూకల వెంకట నారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేకేర్ రెడ్డి,  చనమోని రాములు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్