MG యూనివర్సిటీ భూములను తిరిగి యూనివర్సిటీకె కేటాయించాలని ఎబివిపి ఆధ్వర్యంలో వినతి
నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి(DRO) గారిని కలిసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ భూములను తిరిగి యూనివర్సిటీకె కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని ABVP మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాయకులు పొట్టిపాక నాగరాజు గారు అన్నారు. వారు మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థిని (బాలిక)లకు సరిపడా వసతి గృహం లేని కారణంగా ప్రైవేటు వసతి గృహాల్లో వేలకు వేలు డబ్బులు చెల్లించలేక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని దీని కారణంగానే గతంలో ఉన్న ప్రభుత్వం పానగల్ ఎల్లమ్మ గుడి వద్ద 01 ఎకరం స్థలం కేటాయిస్తే దానిని ఖాళీగా ఉంటుందనే సాకుతో బాలికల వసతి గృహం నిర్మించకుండా మార్కెట్ యార్డుకు ప్రభుత్వం కేటాయించడం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చెయ్యని కారణంగానే యూనివర్సిటీ బాలికల వసతి గృహం నిర్మాణం జరగలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేసి యూనివర్సిటీ బాలికల వసతి గృహం కోసం కేటాయించిన స్థలంలోనే బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకొని వసతిగృహాన్ని నిర్మించాలని,వేరే అవసరాలకు కాకుండా తిరిగి యూనివర్సిటీకె ఆ స్థలాన్ని కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థినిలు వాసవి,శ్రావణి,మౌనిక అలాగే విద్యార్థి నాయకులు కొంపల్లి శివ కుమార్, రుద్రా విగ్నేష్, చత్రపతి, ఆవుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment