అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి-ABVP
*అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి-ABVP*
నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డి.వి.కె రోడ్ లో గల మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ హై స్కూల్ పాఠశాలల ముందు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, నిరసన కార్యక్రమం చేస్తున్న ABVP విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని *ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు* గారు అన్నారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవ పేరుతో ప్రారంభమైన ఈ మిషనరీ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ నేడు వేలకోట్ల ఆస్తులు గడిచిందని ఆరోపించారు.
ఈ పాఠశాలలో ఎయిడెడ్ పాఠశాల ఉన్నప్పటికీ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల నుండి కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాల మాదిరిగానే ఫీజులు వసూలు చేయడం సిగ్గుచేటని,
అన్నమో రామచంద్రా అంటూ కరోనా కాలంలో అతి కష్టం మీద జీవిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం నిత్యం బెదిరిస్తూ ఫీజులు కట్టకపోతే మీ మీ పిల్లల అడ్మిషన్ రద్దవుతుంది అని బెదిరిస్తున్నారని,
మొబైల్ ఉపయోగించడమే రాని LKG,UKG, మొదటి తరగతి మరియు రెండవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి కూడా ముక్కు పిండి మరి 25 వేల నుండి 40 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని, గత సంవత్సరం లాగే ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచకుండా తీసుకోవాలని జీ.వో నెంబర్ 46 లో ఉన్నా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెయింట్ ఆల్ఫొన్సస్ హై స్కూల్ మరియు మొంట్ ఫోర్ట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సంబంధిత అధికారులు డి.ఈ. ఓ గారు కలెక్టర్ గారు స్పందించి సదరు పాఠశాలలపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలపై చర్యలు తీసుకొని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, నగర సంఘటన కార్యదర్శి రుద్ర విగ్నేష్, మల్లేపల్లి నవీన్ కుమార్,ఎర్రోళ్ల స్వామి, బానోత్ నాగేందర్,చిట్టిమల్ల శివ కుమార్,శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment