ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించుకున్నాం - చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించుకున్నాం - చిన్న మరియు మధ్యతరహా పత్రికల రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు.
హైదరాబాద్ : ఎంపానెల్ అయిన ప్రాంతీయ పత్రికలకు తెలంగాణ సమాచార శాఖ రెండున్నర సంవత్సరాల నుంచి అటెండెన్స్ నిర్వహిస్తూన్న ఒరిగింది మాత్రం ఏమీ లేదని, యజమానుల జీవితాలు కరిగిపోవడం తప్ప ప్రభుత్వం చేసింది మాత్రం శూన్యమని చిన్న మరియు మధ్యతరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చిన్న , మధ్యతరహా, మ్యాగజైన్ లకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకుండా నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నదని, ఎన్నో సార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకున్నా, ధర్నాలు చేసిన ఫలితం దక్కలేదని చివరగా మాకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా దాదాపు 10 వేల మంది ఎడిటర్లు, విలేఖరులు ఉన్నారని వారంతా పట్టభద్రులేనని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించుకున్నామని తెలిపారు. గెలిచి మళ్ళీ అధికార పార్టీలోకి పోయేవారికి కాకుండా ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న ప్రతిపక్ష పార్టీకి మద్దతు పలుకుతామని తెలిపారు. అంతే గాకుండా మాకు జరుగుతున్న అన్యానికి నీరసనగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో 200 మందికి పైగా ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు, విలేకరులు పోటీ చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా వివక్ష ధోరణిని విడనాడాలని, అవినీతి అధికారులను తొలగించాలని, మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, ప్రకటనలు క్రమం తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎంపానెల్‌మెంట్ అయిన పత్రికల ఎడిటర్లకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బంగారు తెలంగాణాలో జర్నలిస్టుల బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ &మ్యాగజైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వై.అశోక్,ఉపాధ్యక్షులు, దాయనంద్, ఆగస్టీన్, కోశాధికారి అజామ్ ఖాన్, భూపతి రాజు,వెంకటయ్య, మహమ్మద్ ఖాసీం, జాన్ షాహీద్ ,ఆఫ్రోజ్ ఖ్యరేషి, మోసీన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment