కార్పొరేటర్ మారిన తీరని జియగూడ ప్రజల కష్టాలు
తీరని జియగూడ ప్రజల కష్టాలు
హైదరాబాద్ జి హెచ్ ఏం సి జియగూడ డివిజన్
ప్రజల కష్టాలు తీరడం లేదనే సిట్టింగ్ టిఆర్ఎస్ కార్పొరేటర్ ను ఓడించి మొన్న జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ని గెలిపించారు. అయినప్పటికి మా కష్టాలు తిరడం లేదని, మా బాధలు వినే వారు కరువయ్యారని ఆ డివిజన్ ప్రజలు వాపోతున్నారు.
జియగూడలో ఉన్న ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్. దానిపై ఎన్నో సార్లు అధికారులకు విన్నవించినా, కోర్టులు చెప్పిన వీరి కష్టాలు మాత్రం తీరడం లేదు. దీనితో టిఆర్ఎస్ కార్పొరేటర్ ను ఓడించి బీజేపీ ని గెలిపించారు.అయినప్పటికీ ఎలాంటి మార్పులేదని, ఇప్పటికైనా ఎన్నికైన కార్పొరేటర్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక న్యాయ శాస్త్ర విద్యార్థి జియగూడా డంపింగ్ యార్డు వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు హైకోర్టు కు లేఖ వ్రాయడంతో హైకోర్టు సుమోటోగా పిల్ గా స్వీకరించి జిహెచ్ఎంసి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు అక్కడి పరిస్థితులపై నివేదిక నాలుగు వారాల్లో సమర్పించామని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చి దాదాపు 70 రోజులైనా ఆ అధికారులు పట్టించికోవడం లేదని ధర్మవేద కటిక్ ట్రస్టీ మరియు హైకోర్టు ప్రముఖ న్యాయవాది కరన్ కోట్ నాగేకర్ సాయికుమార్ ఆరోపించారు. వెంటనే నివేదిక సమర్పించి ప్రజల కష్టాలను నిరోధించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Post a Comment