*రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : డిఐజి రంగనాధ్* - - నాణ్యత, మాయిశ్చర్ లాంటి సాకులతో మద్దతు ధర తగ్గిస్తే సహించేది లేదు - - మద్దతు ధర 1,888, సాధారణ ధాన్యంకు 1,868 చెల్లించాలి - -.మాయిశ్చర్, తాలు, మట్టి లాంటి అంశాలను సాకుగా చూపితే సహించేది లేదు - - రేపటి నుండి రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నల్లగొండ : నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని, మాయిశ్చర్, తాలు, మట్టి లాంటి అంశాలను సాకుగా చూపిస్తూ రైతులకు మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిఐజి ఏ.వి. రంగనాధ్. గత కొద్ది రోజులుగా నాణ్యత సరిగా లేదని, ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నదని, తాలు, మట్టి ఎక్కువ ఉన్నదని రైతులు తీసుకువస్తున్న ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా క్వింటాలుకు మూడు నుండి నాలుగు కిలోలను తగ్గిస్తున్నట్లుగా రైతుల వద్ద నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం నాణ్యత లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయించిన విధంగా ధర చెల్లించాలని తెలిపారు. అలా కాకుండా నాణ్యత, మాయిశ్చర్, తాలు సాకుగా క్విం...