కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు ఎందుకు ఎండింది - మంత్రి జగదీశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ పాలనలో
ఆయకట్టు ఎందుకు
ఎండింది
తెలంగాణాను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లిచ్చిన ఘనులు ఎవరూ?
పదవుల కోసం పెదవులు మూసుకుంది నిజం కాదా
*-కాంగ్రెస్ పార్టీ పై ధ్వజమెత్తిన మంత్రి జగదీష్ రెడ్డి*
కాంగ్రెస్ పార్టీ ఎలుబడిలో సాగర్ ఎడమ కాలువ కింది భూములు ఎందుకు ఎండిపోయాయో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడీ డిమాండ్ చేశారు.
తెలంగాణాను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లిచ్చిన ఘనత కాంగ్రెస్ నేత జానారెడ్డి ది కాదా అని ఆయన సూటిగా నిలదీశారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం నుండి నిడమనూర్ మండల పరిధిలోని తుమ్మడం,నారమ్మగూడెం తదితర గ్రామాల్లో జరిగిన ఎన్నికల సమావేశలలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
టి ఆర్ యస్ అభ్యర్థి తో పాటు ఈ ప్రచారంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్,శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,
శాసనసభ్యులు యన్. భాస్కర్ రావు,బొల్లం మల్లయ్య యాదవ్,టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండ జిల్లా టి ఆర్ యస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఈ రాత్రి నిడమనూర్ మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో ఇక్కడి పంట భూములు ఎడారిగా మారుతున్నా ఇక్కడి నేతల పెదవులకు పదవులు అడ్డు పడ్డందునే ఇక్కడి నీళ్లు ఆంధ్రకు తరలి పోయారన్నారు.అటువంటి పార్టీ నేతలు ఏ మొహం పెట్టుకొని ఈ ఉప ఎన్నికల్లో ఓట్లు ఆడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని ఆయన నిలదీశారు.కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికే నల్లగొండ జిల్లా ఫ్లోరిన్ మయంగా మారిందని ఆయన విమర్శించారు. అదే పార్టీకి ఓటేసిన అమాయక ప్రజలకు కండ్ల నీళ్లు తెప్పించారని ఆయన దుయ్యబట్టారు. అదే పార్టీ మూట కట్టుకున్న పాపానికే కాదు తెలంగాణ లో కరువు వచ్చి పంట పొలాలన్ని బీళ్లుగా మారాయని ఆరోపించారు. అటువంటి పార్టీని చేరదీస్తే మళ్ళీ పాత రోజులే పునరావృతం అవుతాయని ఆయన హెచ్చరించారు.2014,2018 వరుస ఎన్నికల్లో టి ఆర్ యస్ పార్టీకి ఓటేసినందుకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయో అన్నది యావత్ ప్రజానీకం ఒక్క సారి గుర్తు చేసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికల్లో ఓడగొట్టి టి ఆర్ యస్ కు పట్టం కట్టినందుకే కదా రైతుబంధు,రైతుబీమా,కఖ్యనాలక్ష్మి/షాధిముబారక్,అమ్మవడి,కేసీఆర్ కిట్ వంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చుట్టారని ఆయన చెప్పారు. ఎన్నికల ముందు చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్,కోటి ఎకరాలమగాణాలకు సమృద్ధిగా నీరు విడుదల తో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నది వాస్తవం అవునా కాదా అన్నది ప్రజలు ఆత్మవలోకనం చేసుకోవాలని ఆయన కోరారు. పదవుల కోసం పెదవులు మూసుకొని సీమాంధ్ర పాలకుల వద్ద మొకరిల్లిన కాంగ్రెస్ ను ప్రజలు ఏ ఎన్నికల్లోనూ విశ్వసించడం లేదన్నారు.2014 తరువాత వరుసగా జరుగుతున్న ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనమన్నారు.అదే ఫలితం రేపటి ఉప ఎన్నికల్లోనూ పునరావృతం కాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రజలకు విశ్వసనీయత రోజు రోజుకు పెరుగుతుందని.....అదే రేపటి ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయానికి దోహదపడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Post a Comment