రియాజుద్దీన్ అకాలమరణానికి చింతిస్తూ సంతాపం ప్రకటించిన జర్నలిస్టులు

 


ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు రియాజుద్దీన్ అకాలమరణానికి సంతాపసూచకంగా ఈరోజు అసోసియేషన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్లాక్టవర్ సెంటర్లో సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రియాజుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ స్వర్గీయ రియాజుద్దీన్ జర్నలిస్ట్ యుద్ధ నౌక అని చిన్న పత్రికల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన నిరంతర నిరంతర శ్రామికుడు అని కొనియాడారు జర్నలిస్టుల కోసం స్వార్థం లేకుండా సభ్యులందరికీ నిరంతరం అందుబాటులో ఉండి వెన్నంటి ప్రోత్సహించే వాడని అలాంటి వ్యక్తి అనారోగ్యకారణంగా అకస్మాత్తుగా అందరినీ వదిలి వెళ్లిపోవడం బాధాకరమన్నారు ప్రజాశక్తి విలేకరి గా జర్నలిస్ట్ ప్రస్థానం ప్రారంభించి పౌర స్వేచ్ఛ పత్రికా స్థాపించి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఏది అన్నారు ఆయన నిస్వార్థ సేవ జర్నలిస్టులందరికీ ఆదర్శప్రాయం అన్నారు ఆయన ఆశయ సాధన కోసం చిన్న పత్రికల సంపాదకులు విలేకరులు ఐకమత్యంగా కృషి చేయాలన్నారు ప్రభుత్వం చిన్న పత్రికల పట్ల చూపు తున్న వివక్ష కారణంగా స్వర్గీయ రియాజుద్దీన్ అనారోగ్యంతో పాటు ఆర్థికంగా చితికిపోయి సరైన వైద్యం చేయించుకోలేక అకాల మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం చిన్న పత్రికల సంక్షేమం గురించి పట్టించుకోవాలని కోరారు టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి జి జయశంకర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా రియాజుద్దీన్ తో స సన్నిహిత పరిచయాలు ఉన్నాయని నమ్మిన సిద్ధాంతం కోసం స్వార్థం లేకుండా కృషి చేసే నాయకుడని ఆయన మరణం జర్నలిస్టులకు తీరనిలోటని పేర్కొన్నారు రియాజుద్దీన్ కు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు సిటీ కేబుల్ ఎండి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రియాజుద్దీన్ మరణం తీరని లోటు అన్నారు జర్నలిస్టులంతా ఆయన ఆశయ సాధన కోసం అంకితభావంతో కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ మసూద్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల రామకృష్ణ  జర్నలిస్టులు ఎండి చౌక తల్లి చారి పల్లె నవీన్ ఆర్ వెంకట్ రెడ్డి డి నాగరాజు వీర్రాజు ఖుద్దూస్ సయ్యద్ శ్రీధర్ సుభాని నజీర్ రాధాకిషన్ లెనిన్  వినోద్  తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్