*టివిని మాయం చేసిన నల్గొండ డిపిఆర్వో*


 *టివిని మాయం చేసిన  నల్గొండ  డిపిఆర్వో*

*పై అధికారూలకు ఫిర్యాదు పోవడంతో హడావిడిగా టివిని ఆఫీసులో అమర్చిన  అధికారి*


నల్గొండ డిపిఆర్వో కార్యాలయములో  ప్రజలకు, జర్నలిస్టులకు   ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం , వార్తలు   చూడడానికి  సమాచార కేంద్రానికి  ప్రభుత్వం  టివి మంజూరు చేసింది .అట్టి టివి ద్వారా ప్రజలకు, జర్నలిస్టులకు  తాజా సమాచారం చూసేవారు.   అట్టి టివిని   జిల్లా అధికారి  తన ఇంటికి తరలించాడు.  ఈ విషయం పై    హైదరాబాద్ లో ఉన్న పై అధికారులకు  ఫిర్యాదు పోవడంతో   సదరు అధికారి హడావిడిగా  టివి తెచ్చి  ఆఫీస్ లో అమర్చాడని తెలిసింది.  ఈ అధికారి ప్రవర్తన మొదటి నుండి వివాదస్పదంగా ఉంది. గతంలో కూడా ఈ అధికారి ప్రవర్తనపై  పలు జిల్లాల్లో ఫిర్యాదులు వచ్చాయి.  నల్గొండ జిల్లాలో కూడా కార్యాలయ సిబ్బంది  వేధింపులు గురి చేస్తున్నాడని ఈయన పై  జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులు కూడా ఈయన ప్రవర్తనపై మంత్రి జగదీశ్వర్ రెడ్డికి, జిల్లా కలెక్టరు కు ఫిర్యాదు చేశారు. అట్టి ఫిర్యాదుల విచారణ జరగకుండా కొంత మంది  లాబీయింగ్ చేసినట్లు తెలిసింది.   ఇప్పటికైనా పై అధికారులు  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు,  పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు. 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!