శ్రీభద్రాచల దేవాలయ ఆగమ, సంప్రదాయములకు మద్దతు గా శ్రీ రామ సేన పేరుతో జాయింట్ యాక్షన్ కమిటీ
శ్రీభద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయ ఆగమ, సంప్రదాయములకు , అర్చక సిబ్బందికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ
శ్రీ రామ సేన పేరుతో జాయింట్ యాక్షన్ కమిటీ
హిందూ ధర్మం అంతా కూడానూ ఆలయాల మీద ఆధారపడి ఉంది. ఆలయం అనేది హిందూధర్మానికి ఆయువుపట్టు వంటిది. అలాంటి ఆలయాలు ఎలా నిర్వహించబడాలి అని చెప్పేవి ఆగమ శాస్త్రాలు. అది దేవతలని బట్టి, ఒక్కొక్క ఆగమం, ఒక్కొక్క సంప్రదాయం ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఇటువంటి పద్ధతులతో శ్రీభక్త రామదాసుగారి చేత ఏర్పాటు చేయబడి, సుమారు 350 ఏళ్ల నుండి నడుస్తున్న దేవాలయం శ్రీభద్రాచల దివ్యక్షేత్రం. అటువంటి
శ్రీభద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయ ఆగమ, సంప్రదాయములకు , అర్చక సిబ్బందికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ శుక్రవారం రోజున ఎల్బీనగర్ లో జరిగిన కార్యక్రమంలో
శ్రీభద్రాచల రామ మహా సేన (శ్రీ.రా.మ.సేన) పేరుతో జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆవిర్భావం జరిగింది. దీనికి శ్రీ శ్రీ శ్రీ కమలేష్ మహారాజ్ స్వామీజీ అధ్యక్షుడిగా, బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారు కన్వీనర్ గా, శ్రీభాష్ యదుమోహన్ ఆచార్య గారు కో కన్వీనర్ గా, శ్రీ ఆనంద్ గౌడ్ గారు ప్రధాన కార్యదర్శిగా, భక్త రామదాసు గారి 10 వ తరం వారసులు శ్రీకంచర్ల శ్రీనివాసరావుగారు కోశాధికారిగా, అలాగే మరికొంత మంది పెద్దలు మాజీ కార్పొరేటర్ కాండురి నరేంద్రాచార్య గారు, పరాంకుశం రవికిరణ్ ఆచార్యగారు, బ్రహ్మశ్రీ రాజేశ్వరశర్మ గారు, శ్రీ రాహుల్ deshpande గారు, శ్రీ యతిరాజుల బాల బాలాజీ గారు, శ్రీ కందాళ వరదాచార్య ,శ్రీ మంగళగిరి యాదగిరి స్వామి గారు, శ్రీ కొండపాక కృష్ణమాచార్యులు గారు, శ్రీ గట్టు శ్రీనివాసాచార్యులు గారు, శ్రీ గట్టు రంగాచార్యులు గారు, శ్రీ శ్రీధర్ సౌమిత్రి గారు, శ్రీ పీతాంబరం వెంకట కిషోర్ గారు మరియు ఇతర పెద్దలు కలిసి ఈ JAC ఆవిర్భావాన్ని ఘనంగా ప్రకటించారు. ఈజేఏసీలో దక్షిణాది రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారుగా 65 ప్రముఖ సంస్థలు వారందరూ భాగస్వాములుగా అంగీకార పత్రాలు అందజేశారు. వివిధ ప్రాంతాల సంస్థల ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఏ ఆలయం, ఏ ఆగమం తో, ఏ సంప్రదాయంలో జరుగుతున్నాయో, ఆ ఆలయ ఆగమ సంప్రదాయములకు చెందని వారెవరూ వాటిని విమర్శించరాదు, తప్పు పట్టరాదు. అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఆయా ఆగమ, సంప్రదాయాలకు చెందిన పెద్దలు న్యాయనిర్ణేతలు తప్ప ఇతరులు కాకూడదు.
అలాగే దేవాలయ ట్రస్ట్ బోర్డులో, ఆయా సంప్రదాయ పెద్దలు ఒక్కరైనా మెంబర్స్ గా ఉండి, దేవాలయ సంప్రదాయాన్ని సక్రమంగా నిర్వహించే విధంగా ప్రయత్నం జరగాలి అని వక్తలు తీర్మానించారు. ఈ జేఏసీ ద్వారా ఒక పటిష్ఠమైన ఆలయ ఆగమ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తేవాలని కూడా తీర్మానం చేశారు.
Comments
Post a Comment