*నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు : డిఐజి ఏ.వి.రంగనాధ్*
*నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు : డిఐజి ఏ.వి.రంగనాధ్*
- - ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలు, అభ్యర్థులపై కేసులు
- - ఇప్పటి వరకు 46.79 లక్షల నగదు, 35 లక్షల విలువైన మద్యం సీజ్
- - కాన్వాయి నిబంధనలు ఉల్లంఘనలపై ఆరు కేసులు
నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని, ఇప్పటికే అలాంటి ఘటనలపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల క్రమంలో చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల సీనియర్ నేతల వాహనాలను తరచూ తనిఖీ చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, కాన్వాయి నిబంధనల ఉల్లంఘన లాంటి అంశాలపై సునిశితంగా దృష్టి సారించి కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రచారంలో మాస్కులు ధరించని వారిపై జరిమానాలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. పలు ప్రాంతాలలో బెల్ట్ షాపులను సీజ్ చేశామని, ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న మూడు, నాలుగు రోజులకు సంబంధించి మరింత పటిష్టంగా దృష్టి పెట్టి నగదు, మద్యం పంపిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ప్రజలంతా స్వేచ్చాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రంగనాధ్ స్పష్టం చేశారు.
*46 లక్షల 79 వేల నగదు సీజ్*
నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 46 లక్షల 79 వేల 200 రూపాయల నగదు సీజ్ చేశామని తెలిపారు. ఇందులో హాలియా సర్కిల్ పరిధిలో విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా 24 లక్షల 89,000 రూపాయలు, పెద్దవూర పోలీస్ స్టేషన్ ద్వారా 2 లక్షల 50,000 రూపాయలు, కొండ మల్లేపల్లి సర్కిల్ పరిధిలోని గుర్రంపోడు పోలీస్ స్టేషన్ ద్వారా 11 లక్షల 5 వేల రూపాయలు, నిడమనూర్ పోలీస్ స్టేషన్ ద్వారా 4 లక్షల 81,200 రూపాయలు, త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 లక్షల 54,000 రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు.
*4012.82 లీటర్ల అక్రమ మద్యం సీజ్*
ఇప్పటి వరకు 35 లక్షల 11,395 రూపాయల విలువ కలిగిన 4012.85 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని, 45 కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. వీటితో పాటు 38 బెల్ట్ షాపులను సీజ్ చేయగా హాలియాలో 5, నిడమనూర్ లో 4, త్రిపురారంలో 3, విజయపురి టౌన్ లో 2, పెద్దవూరలో 9, తిరుమలగిరి సాగర్ లో 1, గుర్రంపోడులో 6, మధులపల్లిలో 8 బెల్ట్ షాపులను సీజ్ చేశామన్నారు.
*కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై కేసుల నమోదు*
ఎన్నికల ప్రచారం సందర్భంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మొత్తం 68 కేసులు నమోదు చేయగా కాంగ్రెస్ పార్టీపై 21 కేసులు, టిఆర్ఎస్ పార్టీపై 24 కేసులు, బిజెపి పార్టీపై 20 కేసులు, ఇతరులపై మూడు కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇందులో హాలియా పరిధిలో 11 కేసులు, నిడమనూర్ పరిధిలో 9 కేసులు, త్రిపురారం పరిధిలో 10 కేసులు, విజయపురి టౌన్ పరిధిలో 8 కేసులు, పెద్దవూర పరిధిలో 10.కేసులు, తిరుమలగిరి సాగర్ పరిధిలో ఏడు కేసులు, గుర్రంపోడు పరిధిలో 10.కేసులు, మాడ్గులపల్లి పరిధిలో 1.కేసు నమోదు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద మొత్తం 17 కేసులు నమోదు చేయగా కాంగ్రెస్ పార్టీపై 6 కేసులు, టిఆర్ఎస్ పార్టీపై 5 కేసులు, బీజేపీపై 3 కేసులు, ఇతరులపై 3 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇందులో హాలియాలో 2, నిడమనూర్ లో 4, త్రిపురారంలో 2, విజయపురి టౌన్ లో 2, పెద్దవూరలో 2, తిరుమలగిరి సాగర్ లో 2, గుర్రంపోడులో 2 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
*కాన్వాయి నిబంధనల ఉల్లంఘనలపై ఆరు కేసులు*
ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అధిక సంఖ్యలో కాన్వాయిలో వాహనాల వినియోగంపై ఆరు కేసులు నమోదు చేశామని, ఇందులో టిఆర్ఎస్ పై 1, కాంగ్రెస్ పార్టీపై 1, బిజెపి పార్టీపై 4 కేసులు నమోదు. చేశామని తెలిపారు.
*మాస్కులు ధరించని అభ్యర్థులపై కేసులు*
మాస్కులు ధరించకుండా ప్రచారం నిర్వహించి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పై తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్లో, బిజెపి అభ్యర్థి పానుగోతు రవికుమార్ లపై పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు రంగనాద్ వెల్లడించారు.
*పార్టీల వారీగా.....*
కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రచారం చేస్తున్న పార్టీలపై పోలీసులు 68 కేసులు నమోదు చేయగా టిఆర్ఎస్ పై 24, కాంగ్రెస్ పై 20, బిజెపి పై 21, తెలుగుదేశం పార్టీపై 1, ఇతరులపై 2.కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇందులో మాడ్గులపల్లి పరిధిలో 3, గుర్రంపోడు పరిధిలో 10, హాలియా పరిధిలో 11, నిడమనూర్ పరిధిలో 9, త్రిపురారం పరిధిలో 10, పెద్దవూర పరిధిలో 10, తిరుమలగిరి సాగర్ పరిధిలో 7, విజయపురి టౌన్ పరిధిలో 8 కేసులు నమోదు చేశామన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కోవిడ్ నిబంధనలు, కాన్వాయి నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే మద్యం, డబ్బు పంపిణీలపై ప్రత్యేక నిఘాతో పాటు ఆకస్మిక తనిఖీలు చేయనున్నామని డిఐజి రంగనాధ్ వివరించారు.
Comments
Post a Comment