కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ఏజ్ లిమిట్ 34 నుంచి 44 ఏళ్ళకు పెంచాలన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు సోషల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఐటీఐఆర్ గేమింగ్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీని స్థాపించాలన్నారు. వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు ఒక్కో ప్రాంత నిర్ధిస్ట ప్రతిభకు సంబందించిన పరిశ్రమలను అభివృద్ధి చేయామన్నారు. అలాగే పెద్ద, మైక్రో అండ్ స్మాల్ మీడియం మ్యానుఫాక్యరింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు హై లెవల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను వివిధ రంగాలకు చెందిన మేధావులు, పారిశ్రామిక రంగాల వారితో ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ, ఎసీ, ఎస్టీ మైనార్జీలకు ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాధి మరియు సొంత వ్యాపారాలను పెంపొందించేందుకు లోన్స్ విడుదల చేయాలన్నారు. ఉద్యోగ నియామకాలు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
Comments
Post a Comment