సీఎం సభకు వచ్చేవారు డిస్టన్స్ పాటించాలి .. మాస్క్ తప్పనిసరి -కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


 సీఎం సభకు వచ్చేవారు డిస్టన్స్ పాటించాలి .. మాస్క్ తప్పనిసరి -కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  

సీఎం కేసీఆర్ హాలియ బహిరంగ సభ  సందర్బంగా హాలియా లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   మాట్లాడుతూ జిల్లాలో ,రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది  కరోనా నిభందలను పాటించాలిని సీఎం సభకు వచ్చేవారు డిస్టన్స్ పాటించాలని .. మాస్క్ తప్పనిసరని అన్నారు 

జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానం ఉంటే టెస్టులు చేయించుకోవాలిని కోరారు. డిఐజి రంగనాథ్ మాట్లాడుతూ కోవిడ్ కి సంభందించి ప్రభుత్వ నిభందలను ఎవరు బ్రేక్ చేసిన కేసులు తప్పవని, సీఎం సభ ఏర్పాటు నిబంధనల ప్రకారం ఏర్పాటుచేయడం జరిగిందిని తెలిపారు. ముఖ్యమంత్రి సభను అడ్డుకోవడానికి చూసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని,  రాజకీయ పార్టీలు ఏవైనా నిబంధనలు వర్తిస్తాయని, ఎవరిని ఎవరు ఇబ్బందులు పెట్టిన చర్యలు ఉంటాయని తెలిపారు .17 వ తేదీన ఎన్నికలు ముగిసేవరకు ప్రతిఒక్కరు  అధికారులను, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టొద్దని కోరారు.

కార్యకర్తలు ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోకండిని, తరువాత ఇబ్బందులు ఉంటాయని, కేసులు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు కరోనా నిబంధనలు బ్రేక్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి,కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, TRS అభ్యర్ది భగత్ కుమార్ తో పాటు మరికొంతమంది పై కేసులు నమోదు చేశామని తెలిపారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కేసులు నమోదుచేస్తున్నామని తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!