హాలియా సభకు హాజరుకాకుండా, మిమ్ములను కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినయ్ - ముఖ్యమంత్రి కేసీఆర్


 హాలియా సభకు హాజరుకాకుండా, మిమ్ములను కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినయ్ - ముఖ్యమంత్రి కేసీఆర్


హాలియా: నల్గొండ జిల్లా హాలియలో జరిగున నాగార్జున సాగర్ ఉపఎన్నికల  ప్రచార  సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఈ  సభకు హాజరుకాకుండా, మిమ్ములను కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినయని ప్రజాస్వామ్యం లో  ఇలాంటి పోకడలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. దేశంలో  ఎన్నో రాజకీయ పార్టీలు సమావేశం లు,సభలు నిర్వహిస్తున్నాయి .కానీ ఇక్కడ ప్రతిపక్షాలకు  విచిత్రమైన పరిస్థితి ఉన్నదిని విమర్శించారు. ఎవరు మంచి చేస్తున్నారో, ఎవ్వరు  అభివృద్ధి చేస్తున్నారో  ప్రజలే సమీక్షలు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఎవరు గెలిస్తే  అభివృద్ధి జరుగుతుందో వారినే గెలిపించండనిబకోరారు. నోముల భగత్ విద్యావంతుడు, యువకుడు,మంచి  విజన్ ఉన్న వాడు.. భగత్ గాలి బాగానే ఉన్నదని అన్నారు. నెల్లికల్లు లిఫ్ట్ లో  నీళ్లు పారిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి దమ్మున్న మాట మాట్లాడిండని, నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చేయకపోతే   రాజీనామా చేస్తా అని జగదీష్ రెడ్డి   మంచి మాట మాట్లాడిండని, నేను దాని  సమర్థిస్తానాని, ఎట్టి పరిస్థితి ల్లో పూర్తి చేస్తామన్నారు. జానారెడ్డి 30 ఏళ్ల ప్రస్థానం అంటారు చేసింది మాత్రం ఎం లేదని, ఎక్కడి గొంగళి అక్కడే ఉందని,  సాగర్ డ్యామ్  ప్రాంతం అనదలా ఉండేదని, ..ఇప్పుడు మున్సిపాలిటీ ని చేసినమని అన్నారు. జానారెడ్డి సాగర్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్  పెట్టించలేక పోయారని,  నేను హాలియా లో డిగ్రీ కాలేజ్ ను మంజరు చేస్తున్నాని, మరో డిగ్రీ కాలేజ్ ను కూడా మంజూరు చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది తెలంగాణ ప్రజలని,  కాంగ్రెస్ వాళ్లు కాదని అన్నారు. రైతు బంధు ద్వారా   రైతు కాలం చేస్తే 5 లక్షలు అందిస్తున్న ఘనత TRS దని, పారదర్శకత మా విధానమని,  ఎవ్వరి ప్రమేయం లేకుండా  మీ ఖాతల్లో  డబ్బులు వేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఫ్లోరైడ్ భూతాన్ని  పెంచి పోషించారన  ఇవ్వాళ  ఇంటింటికి  భగీరథ నీళ్ళ వస్తూన్నాయని, ఆ నీళ్లలో  ప్రజాలువ కేసీఆర్ ను చూస్తున్నారని పేర్కొన్నారు.  25 వేల కోట్లు ఖర్చు పెట్టి 24  గంటల  నిరంతర  విద్యుత్ ఇస్తున్నామని.,ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. మంచి చేసే వాళ్ళను  గెలిపిస్తే ఇంకా మంచి జరుగుతుందని, గులాబీ జెండా పుట్టాక ముందు తెలంగాణ అనాధ ల ఉండేదని దానికి కారణం కాంగ్రెస్ వారేనని అని విమర్శించారు.నాకు ఏ బలం లేకున్నా  తెగించి కొట్లాడానని, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ తెచ్చుడో అని కొట్లాడి రాష్టాన్ని తెచ్చినని అన్నారు. అస్సలు కేసీఆర్  హాలియకు రావొద్దు అని కాంగ్రెస్ వార  కోర్ట్ కు పోయారని, కుట్రలు చేసారని విమర్శించారు.  సాగర్ డ్యామ్ కూడా కట్టాల్సిన చోట కట్టలేదని, అన్యాయం జరిగిందిని అన్నారు. ఉద్యోగుల కు కూడా మంచి PRC ఇచ్చిన ఏకైక ప్రభుత్వం TRS ప్రభుత్వమని తెలిపారు..గతంలో  గ్రామాలు  వల్లకాడు లాగా వుండేవాని, ఇప్పుడు సుందరికారణగా  చేసామని, ప్రకృతి వనాలతో గ్రామాలు   ఆహ్లాదకరంగా మారాయని పేర్కొన్నారు. గిరిజన సోదరులు  ఆలోచన చెయ్యాలని, . తాండలను గ్రామ పంచాయతీ లుగా మార్చా మని  తెలిపారు.రెండో పేజ్ లో కూడా   3 లక్షల మంది కి గొర్రెల యూనిట్ లు  ఇస్తాంమని. సబ్సిడీ పెంచుతాం మని భగత్ ను గెలిపించండిని,సి MC కోటిరెడ్డి ని MLC ని చేస్తామని, అభివృద్ధి పరుగులు  పెడుతుందని  పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో అభ్యర్థి బిగగత్, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్రెడ్డి,  పలువురు మంత్రులు,mp లు mla లు, mlc లు తదితరులు పాల్గొన్నారు....

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్