సమాన్యునివలె బోంచేసిన కేంద్ర మంత్రి అది బీజేపీకు చెల్లు
సమాన్యునివలె బోంచేసిన కేంద్ర మంత్రి అది బీజేపీకు చెల్లు
నాగార్జున సాగర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ: నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రహోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలో పెద్ద దేవులపల్లి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీజేపీ సాగర్ అభ్యర్థి రవికుమార్ నాయక్ మంత్రి వెన్నంటే ఉన్నారు.ఉదయం పెద్దదేవుళ్లపల్లి నుంచి మొదలుపెట్టున ప్రచారం బాబుసాయి పేట,త్రిపురారం,ముకుందా పురంలో రోడ్ షోలు నిర్వహించి హాలియలోని sr ఫంక్షన్ హాల్లో "సాగర్ అభివృద్ధి కి బీజేపీ మ్యానిఫెస్టో "ను మంత్రి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో mla రఘునందన్ రావు,పలువురు రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైన సాగర్ ను బీజేపీ మాత్రమే అభివృద్ధి చేయగలదని ,ఈసారి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.అలానే సాగర్ కు kv స్కూల్ ,ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని,గిరిజనులకు న్యాయమైన రిజర్వేషన్ వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు.బత్తాయి వరి రైతులకు అన్నింటా బీజేపీ ప్రభుత్వం తోడు ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కిషన్ రెడ్డి ఇదే మండలంలోని పంగనికుంటా తండాలో ఓ గిరిజనుడి ఇంట్లో గిరిజనులతో కలసి సహా పంక్తి భోజనం చేశారు.
నియోజకవర్గంలోని తుమ్మడం,నారమ్మ గూడెం,రేగులగడ్డ, నేతపురం,దొక్కలబావి, రాజవరం,బోయగూడెం,కొంపల్లి,తిరుమలగిరి,రంగుండ్లలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.రంగుండ్లలో తాండ వాసుల ఆరాధ్యదైవం బుడియా బాపు ,హనుమాన్ దేవాలయం లో జరిగిన ప్రత్యేక పూజల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఎన్నిసార్లు మంత్రిగా ఉన్న సాగర్ అభివృద్ధి జరగలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.kcr కుటుంబం ,ఆయన బంధువులు తప్ప మరెవరికి కొత్త రాష్ట్రంలో న్యాయం జరగలేదని కిషన్ రెడ్డి అన్నారు.ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరిగిన తెలంగాణ లో అధికారం వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని ,దుబ్బాక నుంచి మొదలైన మార్పు సాగర్ లో కూడా కనిపిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.బీజేపి అభ్యర్థి రవిని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం కూడా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Comments
Post a Comment