ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, విరాళం
ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, విరాళం హైదరాబాద్ లోని వారి నివాసంలో వచ్చి కలిసిన పెళ్లికూతురు బంధువులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సతీమణి, ఉప్పల ఫౌండేషన్ కో-ఛైర్ పర్సన్ ఉప్పల స్వప్న చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర,గాజులు విరాళంగా పెళ్లి కూతురు కి ఇచ్చారు. పేద కుటుంబానికి చెందిన అనాధ మహిళ, వివాహం కోసం మంగళ సూత్రం, మెట్టెలు, చీర,గాజులు విరాళంగా ఇచ్చారు.. మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ అంబేద్కర్ కాలనీ కి చెందిన అనిగళ్ల స్వరూప- మల్లేష్ ల కూతురు వివాహానికి విరాళంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ధికంగా వెనుకబడిన, తల్లిదండ్రులు లేని అనాథ మహిళ వివాహన్నీ గుర్తించి, పేదింటి అమ్మాయిని ఆదుకోవాలని సహాయం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు