కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని జిల్లా కలెక్టరు కు ఆన్లైన్ లో వినతి పంపిన సిపిఎం





కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్  పెంచాలని జిల్లా కలెక్టరు కు ఆన్లైన్ లో వినతి    పంపారు

యధావిధిగా చదవండి                          


*శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ నల్లగొండ గారికి*


         *విషయం* :- *(1) కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్  పెంచుట.*

                                    

                              *(2)వెంటీలేటర్ బెడ్స్ 100కి పెంచుట,రిపేరులో వున్నవాటికి అవసరమైన మెటీరియల్ తెప్పించుట.*

                                 *(౩) కరోన వార్డుల్లో సి.సి కెమారాలు అమర్చుట*                                             

                                 *( 4) జిల్లా కేంద్రం ఆసుపత్రిలో కరోన టెస్టులు 50 మాత్రమే చేస్తున్నారు,రోజుకి 300 కు పెంచుట మరియు phc ల లో 25 మాత్రమే చేస్తున్నారు 100 వరకు పెంచుట గురించి.*

                                    *(5) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇప్పించుట గురించి.*

                                    *(6) ప్రతిరోజు కరోన చికిత్సా పైనా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించీ తగు సుాచనలు చేయుట మరియు అవసరమైన నిధులు కేటాయించి వసతులు కల్పించుట గురీంచీ.*

                *(7) నియోజకవర్గానికి ఒక కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు చర్యల గురించి.*

          *(8)గ్రామపంచాయతిలలో శానిటేషన్ మరియు సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయించుటకు చర్యల గురించి.*

             *NOTE:- ఉన్నత స్తాయి సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అదికారులను,రాజకీయ పార్టీలను,స్వచ్ఛంద సంఘాలను కరోన కట్టడికి సహయం కోరుట గురించి.*


             పై విషయానుా సారముగా తమరికి తెలియజేయునది ఏమనగా     నల్లగొండ జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా చాలా స్పీడ్ గా విస్తరిస్తున్నదీ.పట్టణాలు గ్రామాలలో వందలాదిమంది కరోనా బారిన పడుతున్నారు కరోనా తీవ్రతకు ఆక్సిజన్ శాచ్యురేషన్ పడిపోవడం వలన ప్రాణాలు  కోల్పోవలసి వస్తుంది భయంతో ప్రభుత్వ దవాఖానల వైపు పరుగులు తీస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఇప్పటికీ కరోనా వార్డుల్లో బెడ్స్ ఖాళీలు లేవు.వెంటిలేటర్స్ పరిమితంగా పనిచేస్తున్నవి మిగతా వాటికి సరిఅయిన మెటీరియల్ లేకపోవడం వలన వృధాగా పడివున్నవి.ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు అయినా ఖాళీ లేవని వెనక్కి పంపే పరిస్థితి దాపురించింది.జిల్లా కేంద్రం లో 500 ఆక్సిజన్ తో కుాడిన బెడ్స్ ఎర్పాటు మరియు వెంటీలేటర్స్ 100 వరకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాఫాడాలి.కరోన వార్డులో రోగి బందుచులు విపరీతంగా తిరుగుతున్నారు.సి.సి కెమారాలు ఏర్పాటు చేస్తే పారదర్శకంగా వుంటుందనీ కరొన విస్తరణ ఆగేపరిస్తితి వుంటుంది.కరోన టెస్టులు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోజుకి 50 మాత్రమే చేస్తున్నారు 300 వందలకు పెంచుతూ మరియు మండల కేంద్రాలలో 25 మాత్రమే చేస్తున్నారు కనీసం 100 టెస్ట్ లకు పెంచటం వలన కరోనా విస్తృతి  అరికట్టడానికి అవకాశం వుంటుందీ. కరోన టీకాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా ఆధార్ కార్డు ద్వారా విస్తృతంగా టీకాలు ఇప్పించుటకు ప్రభుత్వానికి తమరి ద్వారా విజ్ణాపన పంపించుట అవసరము.జిల్లా స్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం జరిపి అధికారులు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంఘాలను ఇన్వాల్వ్ చేసి తగు సహాయ సహకారాలు కోరుటము వలన ప్రజలను కట్టడిలో వుంచుటకు కొంత మేరకు ఉపయోగంగా వుంటుంది.

        

           *జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజూ కరోనా పైన సమీక్ష సమావేశం నిర్వహించి తగు సలహాలు సూచనలు చేస్తూ అవసరమైన బడ్జెట్  కేటాయిస్తూ తగిన వసతులు కల్పించి జిల్లా ప్రజలను ప్రజల ప్రాణాలను కాపాడుటకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.*

      

                                       

                  అభివందనాలతో


పాలడుగు నాగార్జున , ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

పుచ్చకాయల నర్సిరెడ్డి ,దండెంపల్లి సత్తయ్య 

సిపిఎం  హెల్ప్ లైన్ బాద్యులు.నల్గొండ జిల్లా 

9492358458.9490098322.

9490098311.9491654225.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్