*టప్పర్ వేర్ పేరుతో మోసాలకు పాల్పడ్డ స్వాతి, పార్వతిలపై పిడి యాక్ట్*
*టప్పర్ వేర్ పేరుతో మోసాలకు పాల్పడ్డ స్వాతి, పార్వతిలపై పిడి యాక్ట్*
నల్లగొండ : పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన స్వాతి టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుండి తీసుకొని వారిని మోసం చేసిన స్వాతి, ఆమెకు సహకరించిన పార్వతి లపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్ తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారిని మోసం చేసి అధిక లాభాలు చూపిస్తానని చెప్పి మోసం చేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ను సంప్రదించగా కేసు నమోదు చేసి నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేసి పిడి యాక్ట్ నమోదు చేసి టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు గురువారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
Comments
Post a Comment