కరోనా తో కొడుకు మృతి ని తట్టు కోలేక ప్రాణం విడిచిన తండ్రి.

 కరోనా తో కొడుకు మృతి ని తట్టు కోలేక  ప్రాణం విడిచిన తండ్రి. 


కరోన మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు. 


నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థికంగా కుటుంబ పరిస్థితి బాగో లేక ఆసుపత్రి  బిల్లు చెల్లించలేక బాధపడుతూ  తండ్రి బాలయ్య రోజు ఆలోచించి ఆలోచించి తనువు చాలించారు. ఇది విన్న మున్సిపల్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.కోడలు ఇద్దరు పిల్లలతో ఇంటికి పెద్దలను కోల్పోయి అనాధలు గా మిగిలి పోయారు.


అయ్యో భగవంతుడా అని ఏడవడం తప్ప ఏమీ లేకుండా అయిపోయే పాపం అంటూ కాలనీవాసులు శోకసంద్రం లో మునిగిపోయారు కరోన రక్కసి తో కుటుంబం అతలాకుతలం అయి ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ఎలాంటి ఆధారం లేని విగత జీవులుగా ఉన్నారు,ఈ తరుణం లో దయ తలిచి తోటి వారు తోచిన విధంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్