*కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయం : డిఎస్పీ*


 *కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయం : డిఎస్పీ*

- - కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు భోజన వితరణ


నల్లగొండ : లాక్ డౌన్ నేపద్యంలో కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.


నల్లగొండ పట్టణంలో లాక్ డౌన్ కారణంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ సిబ్బందికి భోజనం అందించారు. అనంతరం మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు భోజన సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి రావడం, ఇతర ప్రాంతాల నుండి వచ్చి విధులు నిర్వహిస్తున్న వారికి ఇబ్బందిగా ఉన్న తరుణంలో కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం అందించడం ఎంతో అభినందనీయమన్నారు. పోలీసులు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడం కోసం ఇంటికి దూరంగా ఉంటూ ప్రజల కోసం.పని చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని, అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న తమతో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.


కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనమ్, కాచం ఫౌండేషన్ ప్రతినిధులు కాసం శేఖర్, తల్లం గిరీష్, మోదుగు సంతోష్, కాసం వెంకటేశ్వర్లు, కాసం సంతోష్, తదితరులున్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్