మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు - అద నపు కలెక్టర్ రాహుల్ శర్మ

 


మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు - అద నపు కలెక్టర్ రాహుల్ శర్మ

నకిరేకల్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నిక, నల్గొండమున్సిపాలిటీ 26 వ వార్డు కు ఆకస్మిక ఎన్నిక కౌంటింగ్ రేపు 3 న రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జారీ చేసిన కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఆదివారం అదనపు కలెక్టర్ నల్గొండ ఎం.జి.కళాశాల లో నల్గొండ 26 వ వార్డు కౌంటింగ్ నిర్వహిస్తున్న కౌంటింగ్ కేంద్రం,నకిరేకల్  లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నకిరేకల్ మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం లో ఏర్పాట్లు పరిశీలించారు.కౌంటింగ్  రూమ్ లను  పారిశుధ్య సిబ్బంది క్రిమి సంహరక ద్రావణం తో శానిటైజ్ చేశారు.కోవిడ్ నెగటివ్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్, పాస్ లు కలిగి యున్న ఉన్న అభ్యర్థులు,కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ సిబ్బంది,మీడియా, అధికారులను అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు.ఆదివారం ఎన్. జి.కళాశాల నల్గొండ,నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అభ్యర్థులు, ఏజెంట్ లు,కౌంటింగ్ సిబ్బంది,మీడియాకు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించారు.కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో నల్గొండ,నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ లు శరత్ చంద్ర,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్