*ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల*


 *ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల*

నేడు నల్గొండ నగరంలోని స్థానిక బోయవాడ లో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవనం ఏబీవీపీ కార్యాలయంలో  కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో నిరుపేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల వద్దకే విద్య వెళ్లాలి అనే ఉద్దేశంతో పరిషత్ పాఠశాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ లో భాగంగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి పేదరికం వల్ల ఆన్లైన్ క్లాసులు వినలేక తీవ్ర ఇబ్బందులు పడుతు విద్యకు దూరం అవుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గ్రామ గ్రామాన,వాడల్లో, బస్తీల్లో,కాలనీల్లో *పరిషత్ పాఠశాల* అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, ఎన్జి కళాశాల ఉపాధ్యక్షుడు భానోత్ నాగేందర్, బాలాజీ, ప్రవీణ్,రమేష్ బాల్థాక్రే, నరేష్, పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్