ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి
నల్గొండ : కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బగంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని రెండు మాసాలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం ,మరియు అధికారుల నిర్లక్ష్యం వలన మరియు ముందుచూపు లేని కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దై మొలకలేత్తినవని, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడంలో విసిగివేసారిపోతున్నారని, వెంటనే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుందని తెలిపారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఐకేపీ కేంద్రాల్లో నిల్వఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులు విక్రయించిన వరి ధాన్యానికి వెంటనే డబ్బులను వారి ఖాతాల్లో జమచేయాలని. అధికారులు లారీలకొరత లేకుండా చూడాలని మరియు మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని తాలు పేరుతో ధాన్యంలో కోత విధించారాదని ఆయన ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాదురి. వెంకట్ రెడ్డి,బీజేపీ నాయకులు పసుల. సైదులు మరియు రైతులు పాల్గొన్నారు...
Comments
Post a Comment