ఎబివిపి నల్గొండ విభాగ్ ఆధ్వర్యంలో ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్


 ఎబివిపి  నల్గొండ విభాగ్ ఆధ్వర్యంలో ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో జూన్ 10 నుండి 15 వ తేదీ వరకు ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూన్ 10 నుండి 15 వరకు ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ పేరుతో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నుండి మారుమూల గ్రామాలు, గిరిజన తండాల వరకు పెద్ద ఎత్తున 150 స్థలాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నమని తెలిపారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించడం, కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన అనాధలైన విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడం, కోవిడ్ పేషెంట్స్ కి టెలిమెడిసిన్ అందించడం,మారుమూల గ్రామాల్లో మరియు వాడల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.  అవసరమైన సహాయం, రక్తదాన శిబిరాలు,భోజన వితరణ హాస్పిటల్ మరియు రద్దీ ప్రదేశాల్లో శానిటేషన్, మాస్కుల ప్రాధాన్యతపై అవగాహన మరియు పంపిణీ, మొక్కలు నాటడం, ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువుల పంపిణీ,పరిషత్ పాఠశాల పేరుతో విద్యకు దూరమవుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ట్యూషన్స్ ద్వారా చదువులు నేర్పించడం వంటి కార్యక్రమాలు విస్తృతస్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్