ఎబివిపి ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం- నల్గొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి
ఎబివిపి ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం- నల్గొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి
నల్గొండ : నగరంలోని స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ రెండవ రోజులో భాగంగా 200 మందికి భోజన వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి ఏబీవీపీ ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, యువత ఇలాగే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
అదేవిధంగా ఏబీవీపీ నల్గొండ జిల్లా ప్రముఖ్ కత్తుల ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ అనే పేరుతో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 10వ తేదీ నుండి 15 తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలు పేదలకు భోజన వితరణ,కరోనా పై అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం,మాస్కులు పంపిణీ , వాడల్లో శానిటేషన్ చేయడం, అలాగే కరోనా కారణంగా పాఠశాలలకు దూరమైన పేద విద్యార్థులకు పరిషత్ పాఠశాల పేరుతో తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ టౌన్ సి.ఐ చంద్రశేఖర్ గారు, ఎస్సై నరసింహులు గారు, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల సంపత్ కుమార్, యూనివర్సిటీ నాయకులు సామ సుధన్ రెడ్డి, యార్రమద శ్రీనాథ్, బాల్ థాక్రే,లవన్,శరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment