బిజెపి... బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది-డా. దాసోజు శ్రవణ్
బిజెపి... బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది-డా. దాసోజు శ్రవణ్
వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోండి :
హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలోనూ మోడీ సర్కార్
పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నదని, వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలని
ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు . ఏఐసీసీ ఆదేశాల మేరకు, పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో బాగంగా ''ప్రజల చెవిలో పువ్వుపెట్టిన ప్రధాని'' అంటూ మోడీ మాస్కులు ధరించి చెవిలో పువ్వులు పెడుతూ వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్తమాంసన్ని జలగల్లా పిల్చేసే రీతిలో మోడీ పాలన ఉందని, ప్రజలని లూటీ చేయడమే మోడీ సర్కార్ అజెండాయని ఆయన విమర్శించారు. క్రూడాయిల్ ధర తగ్గుతుంటే సేల్స్ ట్యాక్స్ పెంచేస్తున్నారు. ఎలాగైనా ప్రజలని దోచుకోవాలనేదే మోడీ సర్కార్ ప్లాన్ గా ఉందని అన్నారు.
గత ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ డీజల్ ధరల రూపంలో 25లక్షల కోట్ల రూపాయిలు దండుకున్నారని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని, దేశం ఎందుకు ఆర్ధికంగా దివాలా తీస్తుందని ఆయన ప్రశ్నించారు. మోడీ సర్కార్ ఈ దోపిడీ మనస్తత్వాన్ని వీడి, కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలి. వెంటనే పెట్రోల్ డీజల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు
Comments
Post a Comment