పేదల సొంతింటి కల సాకారం చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
పేదల సొంతింటి కల సాకారం చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
*జగనన్న లేఅవుట్ లలో సకల సౌకర్యాలు ,వసతుల ఏర్పాట్లు ..*
*మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో భాగంగా టీడ్కో లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు
నందిగామ : నందిగామ పట్టణంలోని హనుమంతుపాలెం టీడ్కో లే అవుట్ లోని వైయస్సార్ జగనన్న కాలనీలో మెగా గ్రౌండ్ హౌసింగ్ మేళాలో భాగంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలకు శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శనివారం సామూహిక శంకుస్థాపనలు నిర్వహించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకల సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామన్నారు ,గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని నిరుపేదల సొంతింటి కలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని తెలిపారు ,
అదేవిధంగా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు ,గత ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేద కూడా సెంటు స్థలం మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ,ప్రజా సంకల్ప పాదయాత్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతోపాటు ఇళ్ల నిర్మాణాలను సైతం ప్రారంభిస్తున్నామని తెలిపారు ,అదే విధంగా జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులకు అవసరమైన అన్ని వస్తువులను కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు ,
ఈ కార్యక్రమంలో డీఆర్డిఓ పిడి ,నగర పంచాయతీ చైర్మన్ ,వైస్ చైర్మన్ ,కమిషనర్ ,ఎమ్మార్వో ,సీఐ, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు మరియు మున్సిపల్ అధికారులు ,రెవెన్యూ అధికారులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..
Comments
Post a Comment