నల్గొండ ప్రభుత్వ హాస్పటల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు

 


నల్గొండ ప్రభుత్వ హాస్పటల్లో  సమస్యలు వెంటనే పరిష్కరించాలి -  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు


నల్గొండ : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలు  పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు  మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నల్లగొండలోని ప్రైవేట్ హాస్పిటల్ లో అధిక ఫీజుల దోపిడీ కి పాలు పడుతూ ఉంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం అరకొర సౌకర్యాలతో పేద మధ్యతరగతి ప్రజలకు అనేక సమస్యల తో స్వాగతం పలుకుతున్నదిని ఆయన అన్నారు.  ప్రభుత్వ హాస్పిటల్  సిబ్బంది  ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని  ప్రభుత్వ హాస్పిటల్ ను పట్టించుకోవడం లేదని,   ఎన్ని సమస్యలు ఉన్న ప్రభుత్వ అధికారులు  పట్టించుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ సమస్యల పైన జిల్లా అధికారులు పట్టించుకోకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో లో బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ముంత సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక వెంకటరెడ్డి జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి కిరణ్ రూరల్ మండల అధ్యక్షుడు మేకల అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్