అయ్యో పాపం ఆ వృద్దురాలు.. చేతిదాక వచ్చిన సొంతిల్లు చేజారిపోయిందా ..?
అయ్యో పాపం ఆ వృద్దురాలు..
చేతిదాక వచ్చిన సొంతిల్లు చేజారిపోయిందా ..?
కొడుకు ఉపాధి మార్గమే కొంప ముంచిందా ..?
వృద్దాప్యంలో తల్లిదండ్రులకు నిలువ నీడకలిపించి వారి ఆలన ..పాలన చూడాల్సిన కొడుకు చేసే పని ఆ ముసలి తల్లికి ప్రభుత్వం నుండి అందే ప్రభుత్వ ఫలం అందకుండా ఆమెను నిలువ నీడకు దూరం చేసిన విషయం ఆ ప్రాంతంలో అందరిని కలిచివేసింది. ఆమె చిన్న నాటి నుండి కన్న కల ఒక్కటే సొంత ఇల్లు తండ్రి దండ్రులు వంటపని చేసుకొని జీవనం సాగించే వారు. అనంతర వివాహం జరిగిన తరువాత భర్త కూడా సాదా సీదా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. అనారోగ్యం సమస్యతో బాదపడుతూ మంచి వైద్యం అందించేందుకు ఆర్దిక స్తోమత లేక మృత్యువాత పడ్డాడు. ఇద్దరు పిల్లలు ఆడ పిల్లను వారి కుటుంబ పరిస్తితిని అర్దం చేసుకున్న మనసున్న మనిషి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక అబ్బాయి డిగ్రీ వరకు చదువుకొని కంప్యూటర్ నేర్చుకొని ప్రభుత్వం మీసేవ కోసం వేసిన నోటిఫికేషన్‌లో అర్హత సాధించి స్తానికంగా మీసేవ నడుపుకుంటూ వారిరువురు జీవనం సాగిస్తున్నారు. 2019లో ఆమెకు చాతిలో పెద్ద గడ్డకావటంతో హైద్రాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళితే సుమారు ఒక్కరోజే 30వేల రూపాయల టెస్టులు చేసి ట్రీట్ మెంట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుందంటే అక్కడ తెలిసిన వారు ఎవ్వరూలేక దేవుడి మీద భారంవేసి ఖమ్మం తీసుకువచ్చిన తరువాత స్దానిక ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొంత మంతి మిత్రులు, హితులు, సన్నిహితులు అందించిన ఆర్దిక సహాయంతో ఆమెకు ఆపరేషన్ జరిగింది. దేవుడి దయతో మిత్రుల సహకారంతో ప్రాణం నిలిచింది. ఇప్పటి వరకు అనేక సార్లు సొంత ఇంటి స్దలంకోసం అనేక మార్లు దరఖాస్తు చేసుకుంది అయినా ఏక్కడా వారికి న్యాయం జరగలేదు ఇంటి స్దలం రాలేదు. రాజకీయ నాయకుల అండదండలు , అధికారుల చల్లని చూపు లేకుండా ఎవరికి న్యాయం జరగని దేశం మనది ఇది అందరికి తెలిసినా ఒప్పకోలేని నిజం ఒప్పకోని నైజం మనందరిది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడుపేద ప్రజలకోసం ఏర్పాటు చేసిన స్కీమ్‌లలో వితంతు పించన్ ఒక మనసున్న మహారాజు చొవర తీసుకొని ఇప్పించాడు దాంతో ఆమెకు అవసరమైన మెడిసిన్ కోసంఉపయోగపడుతుంది. అలాగే డబుల్ బెడ్‌రూం కోసం అంత దరఖాస్తుచేసుకుంటంటే ఆమె కూడా చేసుకుంది. మొదటి విడత లిస్ట్‌లో ఆమె పేరు వచ్చింది. చాలా సంతోష పడిరది చిన్న నాటి నుండి ఎదురు చూస్తున్న తన సొంత ఇంటి కల ఇక నేరవేరుతోందని తిన్నా పస్తున్నా .....పచ్చడి మెతుకులు తిన్నా కాళ్లు ముడుచుకొని పడుకున్నా ఏవ్వరూ ఏమీ అనరూ అంటూ ఏంతో సంతోషపడిరది. తీరా చూస్తే తమ కుటంబానికి అన్నం పెడుతున్న తన కుమారుడు నిర్వహించే మీసే తన సొంత ఇంటి కలకు అడ్డం పడిరది. మీసేవ నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్ 8`12వేల మధ్యలో వస్తుంది దానిలో 6000వేలు షాపు అద్దె, వెయ్యి రూపాయలు నెట్‌బిల్లు, సుమారు 700 రూపాయలు కరెంట్ బిల్లు ,మిషన్ రిపేర్లు ఇతర ఖర్చు వెయ్యి రూపాయలు, ఇంటి అద్దె 3వేలు ఇలా అన్ని సుమారు 11వేల వరకు ఖర్చు అవుతంది మిగిలిన వాటితో వచ్చే వృద్దాప్య పించన్‌తో జీవనం సాగిస్తున్నారు. సొంత ఇల్ల వస్తే 3వేల వరకు ఆదా అవుతుందని సొంత ఇంటి కల నేరవేరుతుందని భావించిన వారికి స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన ఆర్‌ఐ ఇష్టం వచ్చినట్లు రిపోర్టు రాసి పెట్టటం, రాజకీయ అండదండలు లేకపోవటం అన్నీ కలిపి ఆమె సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయింది. తన చివరి శకం సొంత ఇంటిలో ఏలాంటి బాదరా బందీ లేకుండా గడపాలనుకునే ఆమె ఆశ ఆవిరైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రతి ఇంట బిడ్డగా మెలిగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చేంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావులు ఈ విషయంపై స్పందించి ఆది నుండి కష్టాలు పడ్డ ఆ వృద్దురాలికి తన వృద్యాప్యంలోనైనా సొంతింటి కల నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆశిద్దాం...
Comments
Post a Comment