Posts

Showing posts from October, 2021

జియాగూడలో శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలి- ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ డిమాండ్.

Image
 జియాగూడలో  శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలి- ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ డిమాండ్. హైదరాబాద్: జియాగూడలో  శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలని  ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆయన మా ప్రతినిధి తో మాట్లాడుతూ  జియా గూడలో గల ఆసియాలో కెల్ల పెద్ద  మేకల, గొర్రెల  వధశాల వద్ద ప్రత్యేకంగా శైవల మత ఆచారాలతో  వధించుట కోరకు వధశాలను  ఏర్పాటు చేయలని ప్రభుత్వాన్ని కోరామని, హైకోర్టులో కూడా కేసు వేశామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. హలాల్ చేసిన మాంసాన్ని అల్లాకకు అర్పిస్తారని ఆ మాంసాన్ని ఇతర దేవతలకు అర్పిస్తే ఎంగిలు మాంసాన్ని అర్పించినట్లు అవుతుందని అందుకే శైవల మాత ఆచారము ప్రకారము మేకలను, గొర్రెలను వధించుటకొఱకు ప్రత్యేక వధ శాలను ఏర్పాటుచేయాలని కోరుతున్నామని తెలిపారు.