ఎంపీ అరవింద్ పై దాడిని ఖండించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
ఎంపీ అరవింద్ పై దాడిని ఖండించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
నల్గొండ : నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా కండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
నల్గొండ జిల్లా బీజేపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టిఆర్ఎస్ గుండాలు, కార్యకర్తలు, పోలీసు కలిసి చేసిన దాడి లా భావిస్తున్నామని అన్నారు. నువ్వు అసలు గుండా వా, ముఖ్యమంత్రి వా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. అరివింద్ ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నాడు, నీ ఫామ్ హౌస్ కి రావట్లేదని, బిజెవైఎం కార్యకర్త పై కత్తులతో దాడి చేశారని, ఘటన కు సంబంధించి చెప్పడానికి సిపి కి కాల్ చేస్తే స్పందన లేదని, సిపి కార్యాలయంలో ఒక్కరు లేరని, డిజిపి ఎవరు ఫోన్ చేసిన ఎత్తడంలేదని, డిజిపి కి తెలిసే జిల్లాలలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంత గోరం మా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాడని , ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియచేశామని, సీఎం తన ప్రవర్తన మార్చుకోవాలని విన్నవిస్తున్నామన్నారు.ఖమ్మం లో ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న సాగర్ కి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నామని, ముఖ్యమంత్రి తప్ప ప్రతిఒక్కరు ప్రగాఢ సానుభూతి తెలపాలిని, ఆనాడు ఉద్యమం కోసం ఆత్మహత్య లు చేసుకుంటేఈనాడు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.వరంగల్ లో ఉపద్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడని, తెలంగాణ ఎవరికోసం తెచ్చిందో అర్థం కావడంలేదని, ఏడేండ్ల నుండి ఫామ్ హౌస్ లో ఉంటున్నాడుని, ఏం చేస్తున్నాడో అర్థం కావడంలేదని అన్నారు. 317 జీవో ను సవరించాలని డిమాండ్ చేస్తూ...త్వరలోనే వర్చువల్ కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర నాయకత్వంతో ఉద్యోగులను మాట్లాడిస్తామని తెలిపారు.ముక్యమంత్రి కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, డిప్రెషన్ కి లోన్ అవుతున్నాడని, మాకు అభివృద్ధి అంటే సర్దార్ వల్లభాయ్ కనిపిస్తుంటే ముఖ్యమంత్రి కి నిజాం నవాబు కనిపిస్తున్నాడుని,
నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్ అని,
ఉద్యమ కాలంలో అన్ని దొంగ దీక్షలు చేసిండని పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు సందర్బంగా వోటింగ్ కే హాజరుకాలేదని ఆరోపించారు.ఈ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అత్యంత అవినీతి మంత్రిగా పేరు పొందాడని
ఈఎస్సై స్కామ్ లాంటివి ఎన్నో వున్నాయి అవన్నీ బయటికి తీస్తామని, ఎలుగుబంటి సూర్యనారాయణ ఎపిసోడు ఆ తరువాత జరిగిన అవినీతి అన్ని బయటపెడతామని, ఇవన్నీ బయట పడతాయనే మళ్ళీ తెలంగాణ వాదం అంటూ కొత్త డ్రామాలు ఆడుతూ కేంద్రానికి లేఖలు రాస్తున్నాడని పేర్కొన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వట్లేదని, వరంగల్ లో గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తా అన్నడని ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చావని కేసీఆర్ ను ప్రశ్నించారు. నిజాయితీగా ఉండి ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగించాల్సిన ముఖ్యమంత్రి.. అవన్నీ పక్కన పెట్టి కేంద్రం పై అపవాదు వేస్తున్నావరని, తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి, తాను చేసిన తప్పులను కప్పి పుచుకోడానికి కేంద్రం పై అపవాదులు వేస్తున్నరని, బీజేపీని అడ్డుకునే దమ్ము కెసిఆర్ కు లేదని అన్నారు.ఎస్సి, ఎస్టీ సమస్యల పై అఖిలపక్షం సమావేశం పెట్టాలని కోరారు. ప్రగతి భవన్ లో ఐఏఎస్ అధికారులను పెట్టుకుని చాకిరి చేయించుకుంటున్నావమీ, ఐఏఎస్ అధికారులను ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నవని, రాష్ట్రంలో ఆత్మభిమానం ఉన్న ఐఏఎస్ లు పనిచేయలేకపోతున్నారని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేన్డెర్ రెడ్డి, బంగారు శృతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఇంచార్జి ప్రదీప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్, నూకల నర్సింహ రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగప్ప, వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిమ్మల రాజశేఖర్ రెడ్డి, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment