TUWJకు కృతజ్ఞతలు తెలిపిన చిన్న పత్రికల సంఘం
TUWJకు కృతజ్ఞతలు తెలిపిన చిన్న పత్రికల సంఘం
హైదరాబాద్ : తమకు అండగా నిలిచి ప్రభుత్వ ప్రకటనలు జారీ అయ్యేంతవరకు పోరాడిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె-ఐజేయూ) మేలును మరిచిపోలేమని తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణలు స్పష్టం చేశారు. బుధవారం నాడు అసోసియేషన్ ప్రతినిధి బృందం టీయుడబ్ల్యుజె కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీని కలుసుకొని కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ భవిష్యత్తులో చిన్న, మధ్యతరగతి పత్రికలకు, మేగజైన్లకు ఎలాంటి ఆపద వచ్చినా తమ సంఘం ముందుండి పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ఈ సమావేశంలో చిన్న పత్రికల అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు దయానంద్, కోశాధికారి ఆజం ఖాన్, రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, మాధవరెడ్డి, షాహెద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment