హరిత హోటల్ కు జరిమానా


జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల హరిత హోటల్ పై ఒక వినియోగదారుని ఫిర్యాదు పై నల్గొండ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ , జ్యోతిర్మయి గారి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి మున్సిపల్ అధికారులక సహకారంతో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంట గదిని , స్టోర్ రూమ్ ను  పరిశీలించారు. వంట గదిలో అపరిశుభ్రంగా ఉండడంపై ఆమె హోటల్ యజమాని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హోటల్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యత కలిగిన ఆహార పదార్థాలను మాత్రమే ప్రజలకు అందించాలని, కల్తీ లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు విక్రయించాలని, మరో కొద్ది రోజులు సమయం ఇస్తామని. అప్పటిలోగా శుభ్రంగా ఉంచుకోకపోతే ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫ్రిజ్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తక్షణమే తొలగించారు నిల్వ ఉన్న పెరుగు శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్ కి పంపించు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు  హోటల్లో అపరిశుభ్రంగా ఉండడంతోపాటు  నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ఉండడంతో   వారికి ఐదు వేల జరిమానా విధించారు.
హోటల్స్ లో అపరిశుభ్రంగా ఉన్న, నిల్వ ఉన్న పదార్థాలను ప్రజలకు అందించిన, కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్