గూఢచారి చిన్నదే అది సృష్టించే భూకంపం పెద్దదే?

 

గూఢచారి చిన్నదే అది  సృష్టించే భూకంపం పెద్దదే?


వైశ్య సంఘాల పేరున  జరుగుతున్న దారుణాలను

ప్రపంచ సంఘం లో దుబారా, జవాబు దారి లేకపోవడాన్ని, తెలంగాణలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని ఇటీవల " గూఢచారి " పత్రిక ద్వారా  ప్రశ్నీంచిన విషయం మీ అందరికి తెలిసినదే.... 



ఆ సంఘం లో స్థాయి లేని వారికి పదవులు ఇచ్చి వారి చేతులారా వారే ఆ సంఘాన్ని బజారుకు ఈడ్చుకున్నారు. మీడియా  ఇంచార్జి ఏం చేయాలో కూడా నాలెడ్జి లేని వ్యక్తులను పెట్టి పరువు తీసుకొన్నారు. 


నా వార్తను పట్టించుకోవద్దని, తప్పుడు వార్తని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని  మరియు మా పత్రిక ప్రతినిధిని బెదురుస్తూ వాయిస్ రికార్డులు పెట్టారు.  చాలా చిన్నోడు పట్టించుకోవద్దని వీడియో మెసేజ్ లు పెట్టారు. 

పత్రిక  ప్రశ్నిస్తే , అదో  చిన్నపత్రిక అని,  చిటికన వేలు అని అపహస్యం చేసారు సదరు ఆసంఘ నాయకులు


కానీ వారు తెలుసుకోవలసింది ఎమిటంటే , మీరు బహుమతులు, కవర్లు, బ్రైబ్ లు ఇవ్వడానికి మీకు చిన్నపత్రిక,  పెద్ద పత్రిక అని కొలమాణాలు వుంటాయోమో కానీ   నిజాలు పరిశోదించి రాయడానికి , ప్రజల తరుపున ప్రశ్నించడానికి జర్నలిజంలో చిన్నపత్రిక పెద్దపత్రిక అని తేడా వుండదు.. ప్రశ్న గట్టిదే అయితే అది సృష్టించే భూకంపం పెద్దగా వుంటుంది 

సరిగ్గా  ఇదే నిజం అయింది " గూఢచారి " పత్రిక   వైశ్య సంఘాల పేరుతో జరుగుతున్న లీలల పై వరస కథనాలు ప్రచరించడం,  అవి గ్రామీణ స్థాయి వరకు వైరల్ కావడంతో రాష్ట్ర వైశ్య మహసభ కూడా స్పందించి   జరిగే ప్రపంచ సభకు మాకు ( వైశ్య మహాసభ ) కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటణ చేసింది. ఈ చిన్నోడు వైశ్య సమాజాన్ని నిద్రలేపాడు.  ఆర్య వైశ్య మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు ఇరుకుళ్ళ ఇతర కమ్యూనిటీ లకు మెంబెర్ షిప్  పై  పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓ ప్రముఖ  వార్త వెబ్సైట్ ముచ్చట లో ఇతర కులస్తులకు మెంబెర్ షిప్ పై  ఘాటుగా ప్రశ్నించారు.  సబ్యత్వం రుసుము ఎక్కడ ఉంది ప్రజాస్వామ్య ఎక్కడ అని ఆ సంఘ సభ్యులు నిలదీశారు. 

మరెందరో స్పందించారు.











ఇప్పటికైన కుల  సంఘాల పేరుతో  దందాలు చేస్తున్నవారు  వైశ్య సమాజానికి తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

1) అసలు మీరు సంఘం ఎందుకు పెట్టారు..? దాని లక్ష్యాలు ఎమిటీ..?

2)  మీ సంఘం బై లా బహిరంగ పరచండి

3)  మీ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలంటే ప్రామాణీకం ఎమిటి..?

4) మీ సంఘ రాష్ట్ర , దిగువ స్థాయి వరకు  నియమించిన పాలక కమీటీల పదవుల పంపకంలో ప్రజాస్వామ్య విలువలు ఎంతమేరకు పాటించారు...?

5) మీ సంఘం ప్రారంభించే నాటికి మీ మూలధన నిధి ఎంత..? అందులో మీ వ్యవస్థాపకుల వాట ఎంత...?

6) మీ సంఘం ప్రారంభించిన తరువాత మీరు సేకరించిన నిధులు ఎన్ని..? వాటి ఆడిట్ వివరాలు ప్రకటించండి..?

7) కార్యక్రమాల పేరున మీరు వసూలు చేస్తుంది ఎంత..? ఖర్చు చేస్తుంది ఎంత..? మీకు జవాబుదారీ ఎవరు..?

8)  కూర కన్న మాసాల ఖర్చు ఎక్కువ అని తెలుస్తుంది అనగా మీరు చేసే సేవకార్యక్రంలో  చేసేసహాయం కన్న ఆకార్యక్రమంలో  హజరవుతున్న సినీ ,TV సెలబ్రిటీలకు మరియు పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు చేస్తున్నారట ..ఇదే నిజమేనా..?

9) వైశ్యుల నుంచి నిధులు సేకరిస్తూ వైశేతరులకు సహయం చేయడంలో మీ ఉద్దేశం ఎమిటీ..?

10)  ఏవరో ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి రియల్ ఎస్టేట్ స్థలాల్లో వనవాసాలు / కార్తీక భోజనాల పేరున వైశ్యులను బిచ్చగాళ్ళు గా చేసిన సంఘాలవారు  వెంటనే ఈ విశయంలో వైశ్య జాతికి క్షమాపణ లు చెప్పాలి. 


Simply Saying  గూఢచారి

నిజమైన ఆర్తులకు సహాయం చేసి  వారి హృదయాల్లో  నిలిచేతే చాలు...   ఆర్తుల కృతజ్ఞతలతో పోల్చుతే  గిన్నిస్ బుక్ రికార్డు ఏపాటిది...?.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్