ప్రెస్ అకాడమీ నిధుల జమా ఖర్చులు, అక్రిడేషన్ల పై ఆర్టీఐ దరఖాస్తు సంధించిన సీనియర్ జర్నలిస్టు రూపారాణి కోనేరు
ప్రెస్ అకాడమీ నిధుల జమా ఖర్చులు, అక్రిడేషన్ల పై ఆర్టీఐ దరఖాస్తు సంధించిన సీనియర్ జర్నలిస్టు రూపారాణి కోనేరు
హైద్రాబాద్: సమాచారహక్కు చట్టం పరిధిలో తెలంగాణ ప్రెస్ అకాడమీ నిధుల జమాఖర్చుల వివరాలు, అక్రిడిటేషన్లు పొందినవారి వివరాలు. సంక్షేమ లబ్ది పొందినవారి వివరాలు కోరుతూ సీనియర్ జర్నలిస్టు రూపారాణి దరఖాస్తు చేశారు తెలంగాణ ఏర్పడిన తరువాత పాత్రికేయుల సంక్షేమం కోసం 100 కోట్లు ప్రెస్ అకాడమీకి 8 ఏళ్ల క్రితం కేటాయించింది రాష్ట్రప్రభుత్వం. వాటిలో 16 కోట్లు ఖర్చు చేసినట్టుగా పెస్ అకాడమీ చైర్మన్ ప్రకటించారని. అలాగే 18 వేల మందికి అక్రిడిటేషన్లు ఇచ్చినట్టు, నాలుగువేల మందికి శికణ ఇచ్చినట్లు కూడా వెల్లడించారని, ఆయా వివరాలను కోరుతూ పారదర్శకత కోసం ఒక పాత్రికేయురాలిగా సమాచారం హక్కు చట్టం పరిధిలో 20 ప్రశ్నలతో పాత్రికేయురాలు గా దరఖాస్తును పోస్టు ద్వారాను, మెయిల్ ద్వారా, స్వయంగా ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తు అందచేయడం జరిగిందని యూట్యూబ్ లో ( లింక్ ను టచ్ చేసి చూడొచ్చు) https://youtu.be/7_nofsA1pag
ఓ వీడియో చేశారు. ప్రజాసంబంధ విషయాలలో సమాచారం అందరికి అందించడం బాధ్యత కనుక ఈ వీడియోను చేయడం జరిగిందని తెలిపారు.
Comments
Post a Comment