కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్.


 కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్.

*********************::::************:*:**:********

కాంగ్రెస్ ఓబీసీ సెల్ నల్గొండ జిల్లా నూతన చైర్మన్ గా నియమితులైన జిల్లపల్లి పరమేష్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి,పున్న కైలాస్ నేతతో కలిసి హైదరాబాద్లోని గాంధీభవన్లో ఓబీసీ రాష్ట్ర చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా జిల్లపల్లి పరమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్ పదవికి న్యాయం చేస్తానని తెలిపారు.నల్లగొండ జిల్లాలో ఓబీసీ సెల్ ను మరింత పటిష్ట పరిచి కాంగ్రెస్ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.త్వరలోనే జిల్లా వ్యాప్తంగా మండల కమిటీలన్నింటినీ పూర్తి చేస్తానని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఓబీసీ సెల్ తన వంతు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి.మల్లయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి,జాన్ రెడ్డి, గౌతమ్ ,మదన్, శ్రీశైలం, సైదులు, రమేష్ ,అజయ్, శంకర్, రాజు ,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్