*రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ.* సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన మూడు మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు రూ.250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమనర్సయ్య ను, ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పీ తెలియజేశారు . గతం లో ఈ విషయం పై gudachari vartha https://www.gudachari.page/2024/04/blog-post_17.html
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్ హైద్రాబాద్: (గూఢచారి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి కార్యవర్గ సమావేశంలో తీర్మానించి నట్లు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు కర్మన్ ఘాట్ వేడుక కన్వెన్షన్ లో జరిగిన సమావేశం లో శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ మీటింగ్ లో మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించి నట్లు శ్యామ్ సుందర్ తెలిపారు. రెండు, మూడు నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయన అన్నారు. ఈ సమావేశం లో మలిపెద్ది శంకర్, కాచం సత్యనారాయణ, ప్రేమ్ గాంధీ, మొగుళ్లపల్లి ఉపేందర్, యాదా నాగేశ్వర రావు, మోటూరి శ్రీకాంత్, బొడ్ల మల్లిఖార్జున్, అర్థం శ్రీనివాస్, వందనపు వేణు, పుల్లూరు సత్యనారాయణ, బాలరాజు, కొండూరు గణేష్, కొండూరు రాజేశ్వరి మరియు పలు జిల్లాల నుండి సుమారు 300 మంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్ మహబూబ్నగర్: ఆర్యవైశ్యుల శ్రేయస్సు నా ఆశయం కొత్తవారికి అవకాశం కల్పించడం మా ఉద్యమం అంటూవనపర్తి జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు గద్వాల జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నారాయణపేట జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఆమరవాది లక్ష్మీనారాయణ మహాసభ నుండి దిగి కొత్త వారికి అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు ఈ సమావేశానికి సుమారు 200 మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పట్టణం వైశ్య హాస్టల్ ల్లో ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు ఆధ్వర్యంలో మిడిదొడ్డి శ్యామ్ సమక్షంలో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంటనే దిగి మరియొక కొత్త వ్యక్తికి అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలని కోరిన నాయకులు. ఆర్యవైశ్య మ...
Comments
Post a Comment