9 నెలలకు కుదిరిన ముహూర్తం? ఆర్యవైశ్య మహాసభ సేవ కు మిగిలింది ఒక సంవత్సరం 3 నెలలే?
9 నెలలకు మంచి ముహూర్తం ? ఆర్యవైశ్య మహాసభ సేవ కు మిగిలింది ఒక సంవత్సరం 3 నెలలే?
నల్గొండ: నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఎన్నికలు హోరా హోరీగా జరిగి దాదాపు 9 నెలలు కావస్తోంది. ప్రమాణ స్వీకారాని జరగలేదు. ఇంకా సేవ చేయడానికి మిగిలింది ఒక సంవత్సరం 3 నెలలే. సేవ చేస్తానని, ఉత్సాహము తో పోటీ చేసి గెలుపొందిన వనామా వెంకటేశ్వర్లు కు భారీ మెజారిటీ నే వచ్చింది. అందరూ తొందరలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని అభివృద్ధి జరుగుతుందని ఎదురు చూశారు. సంఘ సేవ చేయడానికి మంచి ముహూర్తం 9 నెలలకు దొరకనట్లు ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. అప్పటి కార్యవర్గం పట్టించుకోక పోవడంతో లో అక్రమాలు, అసాoగీక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ప్రచారం తో పాటు అభివృద్దే నినాదంగా వెళ్లిన వనామా వెంకటేశ్వర్లు కు మహాసభ కౌన్సిల్ సభ్యులు ఆయన్ని నమ్మి భారీ మెజార్టీ ఇచ్చారు. అన్ని మారిపోతాయని, వైశ్యుల అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని బిల్డింగ్ అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డవారికి ఎదురు చూపులే మిగిలాయి. ఎట్టకేలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది. అసలు పదవి కాలం రెండు యేండ్లు మాత్రమే, 9 నెలలు మంచి ముహూర్తం కొరకు చూడడం తో సేవ చేయడానికి సమయం తగ్గింది. భారీ సంఖ్యతో జంబో కార్యవరాన్ని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారానికి పోతున్న అధ్యక్షునికి బెస్ట్ విషెస్ చెపుతుంది మా గూఢచారి. అధ్యక్షుని వాగ్దానం మేరకు వైశ్యుల అభివృద్ధి కి , సంక్షేమానికి కార్యవర్గం కృషి చేస్తుందని, బిల్డింగ్ పై అంతస్తు నిర్మాణం, లిఫ్ట్, కాంపౌండ్ ఏర్పాటు, మరియు గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ ల అభివృద్ధికి కట్టుబడి ఉంటారని ఆశిద్దాం.
Comments
Post a Comment