కాల్పుల కలకలం


 హైదరాబాద్ మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థిరాస్తి గొడవల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్