బండి సంజయ్ పాదయాత్ర పై గుండాల దాడిపై డా దాసోజు శ్రవణ్ బీజేపీ, పత్రిక ప్రకటన యధాతథంగా
బండి సంజయ్ పాదయాత్ర పై గుండాల దాడిపై
డా దాసోజు శ్రవణ్ బీజేపీ, పత్రిక ప్రకటన యధాతథంగా
1. బండి సంజయ్ పాదయాత్ర పై గుండాల దాడిని ఖండిస్తూ, దాడికి ప్రోత్సహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై హత్యాయత్నం కేసులు పెట్టాలి.
2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పాదయాత్ర సందర్బంగా తెరాస గుండాల కర్రలతో, రాళ్లతో చేసిన దాడిని ఖండింస్తున్నాం.
3. ఇది తెరాస అహంకార అరాచక వైఖరికి నిదర్శనం, వారి రాక్షస ప్రవృత్తికి ప్రతీక.
4. బండి సంజయ్ గారి పాదయాత్ర నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కి పెరుగుతున్న జనాదరణ చూసి తట్టుకోలేక ఈ రకమైన హింసకు పాల్పడుతున్నారు.
5. ప్రత్యక్షంగా దాడికి పాల్పడ్డ వారిపై, మరియు వారిని ప్రోత్సహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
6. దాడి జరుగక ముందే, ఎర్రబెల్లి దయాకర్ రావు పత్రిక సమావేశం పెట్టి మరీ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటాం అని రెచ్చగొట్టే ప్రకటన చేసి కుట్రపూరితంగా ఈ దాడికి పాల్పడ్డడు.
7. వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు, 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఈ రాక్షస దాడికి పాల్పడటం, కెసిఆర్ పిరికితనానికి నిదర్శనం.
8. ఈ దుశ్చర్య తెరాస పతనానికి నాంది. తెరాస నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. వారి భవిష్యత్తు ఓటమి కళ్ళ ముందు కదలాడుతుంది. అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండ్రు. దాడులు చేసి బీజేపీ ని బెదిరించాలని అనుకుంటే, తెరాస నాయకుల మూర్ఖత్వమే అవుతుంది.
9. కంచే చేను మేసినట్లు, తెలంగాణ పోలీసులు తెరాస కు గులాములుగా పనిచేస్తూ, తెరాస కార్యకర్తల రాళ్ళ దడి గురించి ముందే తెలిసి నప్పటికీ, సరియన భద్రత కల్పించకుంట్ల, రాళ్ళ దాడికి పాల్పడుతున్న తెరాస గుండాలను నియంత్రించకుండా, పోలీసువృత్తిని కించపరుస్తుండ్రు.
10. గతంలో జుక్కల్ నియోజక వర్గంలో "ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ లో వివేక్ వెంకటస్వామి పై దాడి చేసిండ్రు, బండి సంజయ్ రెండో విడత పాదయాత్రలో మహబూబ్ నగర్ జిల్లాలో దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు జనగాం జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత పాద యాత్రలో దాడికి పాల్పడ్డారు. దాడులతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుండ్రు.
11. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజా సమస్యలపై, మరియు తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగకుండా బెదిరింపులకు పాల్పడేందుకు చేస్తున్న ఈ దాడులు, తెరాస నేర ప్రవృత్తిని ప్రతిబింబిస్తున్నాయి. బండి సంజయ్ పాదయాత్ర సాఫీగా కొనసాగేలా పూర్తి రక్షణ కల్పించాలని డీజీపీ గారికి డిమాండ్ చేస్తున్నాం.
డా శ్రవణ్ దాసోజు
బీజేపీ
Comments
Post a Comment