బిజెపి అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ అందరికీ పక్కా గృహాలు : బండి సంజయ్
బిజెపి అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ అందరికీ పక్కా గృహాలు : బండి సంజయ్
కేసిఆర్ కుటుంబం జర్నలిజం తో వ్యాపారం చేస్తుంది,
కెసిఆర్ ప్రభుత్వం నిజాలు రాసే జర్నలిస్టులను వేధిస్తుంది.
నిజాలు నిర్భయంగా వార్తలు రాసే జర్నలిస్టులకు బిజెపి అండ ఉంటుంది.
భువనగిరి:
3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా జర్నలిస్టులతో సంజయ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.
కెసిఆర్ పాలనలో ప్రజలే కాదు జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిజం రాసే జర్నలిస్టులకు నిద్ర లేకుండా కేసీఆర్ కుటుంబం వేధిస్తోందని దీనినీ బిజెపి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
కెసిఆర్ పాలన అవినీతి మయమైందని కెసీఆర్ కుటుంబ పాలన తెలంగాణలో అన్ని వ్యవస్థలతో పాటు జర్నలిజాన్ని వ్యాపారం చేశారన్నారు.
సమాజం హితం కోసం పాటుపడే జర్నలిస్టులు ఎదుర్కొనే ప్రతి సమస్య తనకు తెలుసన్నారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి జర్నలిస్టులకు ఇల్లు ఇప్పించే బాధ్యత తనదే అన్నారు.
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల కీలకపాత్రా పోషించారని తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఇండ్లు వస్తాయని అక్రిడేషన్ వస్తాయని నమ్మిన జర్నలిస్టులను కెసిఆర్ నట్టేట ముంచారన్నారు.
వారు వీరు కాదు కేసీఆర్ కు మోసం చేయడంలో పరిపాటి లేరన్నారు.
కెసిఆర్ అవినీతి పాలనను పడగొట్టడమే లక్ష్యంగా చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలతోపాటు జర్నలిస్టులు కూడా సహకారం అందించాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి నీ వెలికి తీసేందుకు జర్నలిస్టులు భయపడద్దని వారికి ఏదైనా ఇబ్బందులకు దాడులకు కేసులకు ప్రభుత్వం గురి చేస్తే పార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిన్న పత్రికల పేరుతో మీరు కించపరచుకోదని పత్రిక ఏదైనా ఒకటే అని రాసే వార్తలో దమ్ము ఉండాలి అన్నారు. మీడియా మిత్రులతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు వరకు నిరంతరం మీడియా తనకు సహకరించిందని తెలిపారు. నల్గొండ జిల్లా అద్యక్షలు భూపతి రాజు ఇచ్చిన వినతి పత్రంలో చిన్న పత్రికలకు ప్రతి నెల లక్ష రూపాయల ప్రకటనలు ఇవ్వాలని కోరారు. అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ళ స్థలాలు, 15సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం, ఏదైనా ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం నుంచి 50 ఎక్స్గ్రేషియా వచ్చేలా కృషి చేయాలని జర్నలిస్టులు మెమోరండం అందించగా జర్నలిస్టులు అడిగిన కోరికలు గొంతమ్మ కోరికలు కావని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా అమలుపరిచేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలతోపాటు ప్రజల సమస్యలు తీరాలంటే కెసిఆర్ గద్దె దిగాల్సిన అవసరం ఉందని లేదంటే తెలంగాణను భారతదేశంలోనే అధోగతి పాలు కేసీఆర్ చేస్తారని దాన్ని అడ్డుకోవాలంటే గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రాల ఏర్పాటు జరిగితే అభివృద్ధి జరుగుతుందని కెసిఆర్ పాలనలో తెలంగాణ అధోగతి అయిందన్నారు. ఈ కార్యక్రమంలో IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ భరత్ కుమార్ శర్మ సంగారెడ్డి జిల్లా రాష్ట్ర కార్యదర్శి బర్ల శ్రీనివాస్ సంగారెడ్డిలో అధ్యక్షులు అశోక్, నల్గొండ జిల్లా అధ్యక్షులు భూపతి రాజు,నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బాపూరావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రంగారెడ్ది జిల్లా జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు రాకేష్ చారి, AB న్యూస్ బ్రహ్మం 9TV తెలంగాణ సాయి K నరసింహ, వెంకన్న , అశోక్ కోసిగే సిద్దిపేట ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీకాంత్ చారి రవి విష్ణు వర్ధన్, శ్రీనివాస్, నర్సింలు, నల్గొండ జిల్లా సెక్రటరీ జనరల్ కొండ సంపత్, జిల్లా కోశాధికారి గుబ్బ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కొండ భవాని ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Post a Comment