బీజేఎం ఆధ్వర్యంలో *తిరంగ యాత్ర*


 బీజేఎం ఆధ్వర్యంలో *తిరంగ యాత్ర*

నల్గొండ: ఆజాద్ క అమృత్ మహోత్సవం లో భాగంగ ఈ రోజు భారతీయ జనతా యువమోర్చా ఆద్వర్యంలో  నల్లగొండ పట్టణ కేంద్రంలో *తిరంగ యాత్ర* నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు  *యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు   మాట్లాడుతూ మనకు దేశ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశ స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు భారతీయ జనతా పార్టీ నిర్వహించడం చాలా సంతోష కరమని,  భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త దేశభక్తి ని చాటుకుంటూ ఇతరులను కూడా ఈ కార్యక్రమంలోకి తీసుకురావడం ప్రతి మనిషి దేశ భక్తి కలిగి వుండాలని ప్రతి ఒక్కరిని  జాగృతం చేయటమే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త భాద్యత అని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు సంవత్సరము నుంచి ప్రతి కార్యక్రమం సందర్భంగా మనం నిర్వహించడం జరిగింది ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం మరియు మన దేశంలో ఉన్న ఉన్న కొందరు స్వార్థం కోసం దేశం పై బురద చల్లేప్రయత్నం చేయడం జరుగుతుంది అలాంటి వారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేశభక్తి కలిగి సరైన మార్గము లో నడవాలని సూచించడం జరిగిందని ప్రతి పౌరుడు తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవెయ్యాలి అని అన్నారు. ఆగష్టు 15 న జాతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, పార్లమెంట్ కాంటెస్టడ్ అభ్యర్థి 2019 గార్లపాటి జితేంద్ర కుమార్ కన్న్మంత శ్రీదేవి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరా చారి,జిలా కోశాధికారి విద్యాసాగర్, మీడియా ఇంచార్జి పాలకురి రవి,మైనార్టీ నాయకులు సయ్యద్ పాషా, గడ్డం మహేష్,పట్టణ ఉపాధ్యక్షుడు కిషన్,మహిళ మోర్చా నాయకురాలు నెవర్సు నీరజ,హైమ, జిల్లా యువ మోర్చా జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి,జిల్లా కార్యవర్గ సభ్యులు నందిపాటి శ్రీకాంత్, దాసరి సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శి సూర్య,జీవన్,పవన్ నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్