అధ్యక్షుని ప్రమాణ స్వీకారం లో హైలైట్స్ పదనిసలు


 

అధ్యక్షుని ప్రమాణ స్వీకారం లో హైలైట్స్  పదనిసలు

*పాపం ఎల్వీకి  అవమానం. జిల్లా సంఘం లో స్వర్గీయ కొత్త వెంకటేశ్వర్లు కాలం నుండి  4,5 పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా  సుదీర్ఘంగా సేవలందించారు.  ఈ రోజు జిల్లా భవన్ ఉందంటే స్వర్గీయ  వీరెల్లి మరియు ఎల్వీ ల ఘనతే. ఎల్వీ భూమి కొనుగులునుండి బిల్డింగ్ నిర్మాణం కొరకు సొంత డబ్బులు  పెట్టి అప్పులు తెచ్చి తిప్పలు పడి ఓ రూపు కు తీసుక వచ్చాడు.  అలాంటి వ్యక్తి కి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా ప్రసంగం మధ్యలో రాష్ట్ర నాయకుడు, జిల్లా నాయకులు అడ్డుపడడం చాలా బాధాకరం  ఇలాంటి సంఘటనలు మంచి సేవలకు  విఘాతం కలుగే అవకాశం ఉంది.


*జిల్లా నాయకత్వం ఒక్కరి కి బందీ అయ్యిందని గుసగుసలు


*రాష్ట్ర నాయకునికి అవమానం,  రాష్ట్ర అధ్యక్ష పదవి పై జిల్లా నాయకుడి కన్ను పడ్డట్లు ఉన్నదని ముచ్చట్లు.


*ప్రమాణ స్వీకారం లో నవ్వులు, రెండు సంవత్సరాల కాలానికి అని రాష్ట్ర అధినేత ప్రమాణ స్వీకారం చెపిస్తుంటే , దానికి బదులుగా జిల్లా అధ్యక్షుడు  అతి ఉత్సాహం తో ఈ రోజు నుండి రెండు రెండు సంవత్సరాలు అని చెప్పడం తో రాష్ట్ర అధినేత అభ్యంతరం చెప్పడం తో సభలో నవ్వులు. పాపం జిల్లా అధ్యక్షుడు ఎక్కువ కాలం సేవ చేయాలన్న కోరికకు విఘాతం .


*మాస్టర్ ఆఫ్ సెర్మినలను వ్యాఖ్యానం చేయకుండా అడ్డుకున్న ఓ నాయకుడు. పాపం మాస్టర్ ఆఫ్ సెర్మినీలు.


*పదవులు పంచేటప్పుడు, కార్డులో పేర్లు ముద్రించేడప్పుడు మాకు చెప్పకుండా  మా పేర్లు పదవులు ప్రింట్ చేసారని పలువురు అభ్యంతరం. మీటింగ్ కు డుమ్మా కొట్టినట్లు సమాచారం.


*అతిధులు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు గైర్హాజరు. వారి నుంచి అయిన అనుమతి తీసుకున్నారో లేదో అన్న సందేహాలు వెలిబుచ్చిన కొందరు వైశ్యులు.


*ఇచ్చిన మాట తప్పారని అలిగి సభకు రాని ఓ కమిటీ చైర్మన్.

*పదవుల కన్న తక్కువ సంఖ్యలో జనం.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్