వాసవీ అమ్మ వారికి తలవంపులు తెస్తున్న అక్రమార్కులు


 


వాసవీ అమ్మ వారికి తలవంపులు తెస్తున్న అక్రమార్కులు


వాసవీ అమ్మవారు సత్యం, ధర్మం, త్యాగానికి మారుపేరు.

ఆత్మాభిమానం  కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి అగ్నికి ఆహుతి అయ్యింది.

ఆమె జాతిలో పుట్టిన  ఆర్యవైశ్యులు కొందరు  దానికి విరుద్ధంగా

 వాసవీ అమ్మ వారి  పేరు తో కులం పేరుతో

* బ్యాంకులు

* వెంచర్స్ పేరుతో స్కీమ్స్   

* రియల్ ఎస్టేట్  సంస్థలు  

* బిజినెస్ గ్రూప్స్

* విద్యా సంస్థలు  

* హాస్పిటల్ లు

* సేవా కేంద్రాలు

* కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు

* చిట్ ఫండ్ సంస్థలు 

* అవార్డు సంస్థలు   

* హాస్టళ్లు 

* మార్కెటింగ్ సంస్థలు  

* అన్నదాన సత్రాలు

 పెట్టి ప్రజలను దోచుకోవడమే  లక్షంగా సంస్థలు స్థాపిస్తున్నారు. అమ్మవారికి తలవంపులు తెస్తున్నారు .

వాసవీ అమ్మ వారి పేరు పెట్టుకుంటే త్యాగాలు చేయాలి కానీ అంత మోసం దగా సంస్థలలో  నాయకులుగా చెలామణి అవుతూ, సమాజంలో గుర్తింపు పొందుతూ, వసూలు చేసిన చందాల్లో వెనుకనుండి  30 శాతం కమీషన్లు దొబ్బి అక్రమాలకు పాల్పడుతున్నారు.

సంస్థలో  పదవులు పొందిన తర్వాత దశాబ్దాలపాటు ఎన్నికలు నిర్వహించకుండా, సంస్థ జమాఖర్చులు సభ్యులకు ఆర్యవైశ్య  సమాజానికి  చెప్పకుండా వారి సొంత ఆస్తులుగా అనుభవిస్తున్నారు.

ఈ అక్రమార్కుల పై అమ్మ వారు ఆగ్రహించాలి.

 అక్రమాలపై ED  కన్ను పెట్టాలి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.

ఇలాగే తప్పు చేసే సంస్థలు మితిమీరితే భవిష్యత్తులో ఆ సంస్థలు  ప్రభుత్వపరమైయితే ఆ తప్పుకు ఆ సంస్థలోని నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్