గుర్రంపోడ్ మండల ఆర్యవైశ్య సంఘం ఒకరి సొంత జాగిరా?
గుర్రంపోడ్ మండల ఆర్యవైశ్య సంఘం ఒకరి సొంత జాగిరా?
నల్గొండ జిల్లా : ప్రజాస్వామ్యాన్ని, పెద్దల ముందు జరుగిన నియామకులను అపహాస్యం చేస్తూ నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం ఆర్యవైశ్య సంఘాన్ని సొంతజాగీరుల అధ్యక్షుడు వాడుకుంటున్నాడని మండల వైశ్య నాయకులు ఆరోపిస్తున్నారు. 2021 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికలలో మునిసిపల్ ఛైర్మెన్ మరియు ఇతర పెద్దలముందు నియమించుకున్న వారిని తొలగించి ఇతరులకు పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి తీర్మానం లేకుండా జిల్లా ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులను నియమించుకున్నాడని, ఇప్పడు జిల్లా కార్యవర్గంలో కూడా మండల కమిటీ లో చర్చించకుండా పదవులకు సిఫారసు చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నీ జిల్లా అధ్యక్షుడు కి విన్నవించుకున్న ఎలాంటి మార్పు జరగలేదని వాపోతున్నారు. మేము ఎన్నో ఏండ్లనుండి వైశ్యుల సమస్యల పై పోరాటం చేస్తున్నామని, సంఘం లో జరిగిన పొరపాట్లను ప్రశ్నిస్తే పొరపాట్లను సరి చేయకుండా మమ్ముల తొలగించి అవమణిస్తున్నారని తెలిపారు.
Comments
Post a Comment