నవ్య పైన దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి* పాలడుగు ప్రభావతి ఐద్వా నల్గొండ జిల్లా కార్యదర్శి డిమాండ్.


 *నవ్య పైన దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి*

         పాలడుగు ప్రభావతి ఐద్వా నల్గొండ జిల్లా కార్యదర్శి డిమాండ్.


     నల్లగొండ పట్టణ కేంద్రంలో నాగార్జున కళాశాల విద్యార్థిని నవ్య పైన అత్యంత పాశవికంగా కత్తితో దాడి చేసి హత్య   ప్రయత్నం చేసిన నిందితుడు రోహిత్ అతనికి సహకరించిన  దుండగులను కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు..ఈరోజు ఐద్వా,యస్ యఫ్ ఐ ల ఆద్వర్యంలో నల్గొండ సుభాష్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.మరియు జిల్లా యస్.పి రెమా రాజేశ్వరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందీ. విద్యార్దినిలపైనా మహిళల పైనా అత్యంతా పాశవికంగా సభ్య సమాజం తలదించుకునే విదంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. నవ్యపైనా గతంలో కుాడా ఈ దుర్మార్గులు దాడిచేసి పోలీసులకు తెలియజేశారనీ కఠినంగా దండిస్తే మళ్ళీ ఈ ఘటన పునారవృత్తం కాకపోయేదనీ అన్నారు.జులాయిలు, మత్తు పదార్దాలకు భానిసలైనా వారిని ఉపేక్షించరాదనీ అన్నారు.       యస్ యఫ్ ఐ జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ కాలేజీలు హస్టల్ లో అమ్మాయిలకు అబ్బాయికు చైతన్యం కలగించే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో కేసుల్లో ఇరికితే భవిష్యత్తు అందకారమైతదని తెలుపాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని,పార్కులు కాలేజీలు హస్టల్స్ లో విధిగా సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధా,నిమ్మల పద్మ,జిట్ట సరోజ యస్ యఫ్ ఐ జిల్లా అద్యక్షులు ఆకారపు నరేష్ ఐద్వా   జిల్లా ఆఫీస్ బేరర్స్ తుమ్మల పద్మ భుాతం అరుణ జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల ఉమారాణి లింగమ్మ  బుజ్జమ్మ  మల్లెపాక బారతమ్మ గోపమ్మ లక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు.


                      

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్