దాసోజుకు ఘన స్వాగతం
దాసోజుకు ఘన స్వాగతం
హైదరాబాద్: భారతీయ జనతపార్టీ నేత డా. దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. భారతీయ జనతపార్టీలో చేరి మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డమీద అడుగుపెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నన్ను ఎంతో ప్రేమతో పార్టీలోకి స్వాగతించిన భారతీయ జనతపార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతపార్టీలో చేరిన తర్వాత తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడొచ్చచ్చు, అధికార మార్పిడి జరుగుతుంది, భారతీయ జనతపార్టీ నేతృత్వంలో కేసీఆర్ దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడతామనే నమ్మకం కలిగింది. ఈ దిశలో మునుగోడు ఎన్నికలో కర్రుకాల్చి టీఆర్ఎస్ పార్టీకి వాత పెట్టె పరిస్థితి ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్నాం. రానున్న రోజుల్లో సామజిక, ప్రజాస్వామిక తెలంగాణ కోసం భారతీయ జనతపార్టీ కార్యకర్తగా నిరంతరం కృషి చేస్తా'' అన్నారు
''నేడు తెలంగాణ సమాజం కీలకమైన పరిణామంలో వుంది. తెలంగాణ సమాజం బాగుపడుతుంది, అమరవీరుల త్యాగాలకు ఫలితం దక్కుతుందని కేసీఆర్ కు రెండు సార్లు అధికారం ఇస్తే.. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. కేసీఆర్ కు రెండుసార్లు అధికారం ఇచ్చాం. అధికారంలో వున్న కేసీఆర్.. ఏరకంగా అహంకారం, ఆధిపత్యం, అణిచివేత, అవినీతికి పాల్పడ్డారో చూశాం. ఇపుడు మూడోసారి అధికారంలోకి రావడం కోసం అనేక రకాలుగా నక్క జిత్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ నక్కజిత్తుల ప్రయత్నాలని ప్రజలు తిప్పికొట్టి, నీతి, విలువలతో అవినీతి రహిత పాలన అందిస్తున్న నరేంద్రమోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతపార్టీకి పట్టం కట్టాలి'' అని కోరారు.
గత ఎనిమిదేళ్ళ కేసీఆర్ పాలన లో అనేక వాగ్దానాలు చేసిన కేసీఆర్ ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మిగులు బడ్జెట్ వున్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. అవ్వలకు తాతలకు వికలాంగులకు పెన్షన్ సమయానికి రావడం లేదు. ప్రభుత్వం ఉద్యోగాలకు కూడా సమయానికి జీతాలు లేవు. మొత్తం ఒక దివాలు కోరు, అసమర్ధత పాలనతో రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బతీశారు కేసీఆర్. అనేక రకాలుగా పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్న కేసీఆర్.. కేంద్రం డిజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తే దానికి అనుకూలంగా రాష్ట్రంలో తగ్గించి ప్రజల మీద భారం తగ్గించాలనే నైతిక భాద్యత లేకుండా ప్రజలని పట్టిపీడిస్తున్నారు. ప్రభుత్వం భూములని అమ్ముకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు ప్రజల రక్తమాంసాలని పీల్చుకుతింటున్నారు. తెలంగాణ అంటే వ్యవసాయ ఎకాననీ కానీ నేడు బార్ అండ్ బీర్ గా మార్చేశారు కేసీఆర్. ప్రభుత్వ విద్య వైద్యం స్వర్వ నాశనం చేశారు. స్వయం ఉపాధి కోసం లోన్స్ ఇవ్వడం లేదు. నలఫై లక్షల మంది చదువుకున్న యువతిని నిరుద్యోగులగా మార్చి దుర్మార్గామైన పాలన చేస్తున్నారు కేసీర్ఆర్.
లక్షా యాభై వేల కోట్ల రూపాయిల తెలంగాణ ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ .. గోదారి ఉదృతికి మునిగిపోయింది. ఈ పాపం ఎవరిది ? డిజైన్ లోపం వలన ఇది జరిగిందని విచారణలో తేలింది. నిపుణుల సలహాలు లేకుండా కేసీఆర్ ఇంజనీర్ అయినట్లు ప్రాజెక్ట్ కడితే అది నేడు మునిగిపోయింది. కాళేశ్వరం ముంపు వ్యవహారాన్ని ఒక మాఫియాలో చేస్తున్నారు. కనీసం దీనిపై ఒక రివ్యూ లేదు. ఇలా అనేక అసమర్ధతలని కప్పి పుచ్చి మూడోసారి అధికారంలో రావడానికి నక్కజిత్తులు ప్రయత్నాలు చేస్తన్నారు. పొద్దున్నలేస్తే ప్రదంబి మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. నీతి అయోగ్ మీటింగ్ కి కూడా పోలేదు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే రీతిలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగుతోంది. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పడంతో పాటు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి పట్టాం కట్టాలి.'' అని కోరారు.
Comments
Post a Comment