రేపటి నుండి 2 రోజుల పాటు ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ కౌన్సిల్ సమావేశాలు - టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు
రేపటి నుండి 2 రోజుల పాటు ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ కౌన్సిల్ సమావేశాలు - టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈనెల జరుగనున్నాయి. సెప్టెంబర్ 23, 24 తేదీలలో జరుగనున్న సమావేశాలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతుండగా.. అధితులు బీజేపీ సెల్ ఓబీజీ మోర్చా ప్రెసిడెంట్, ఎంపీ డా.లక్షణ్, ఎంపీ కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న అతిరథమహారథులకు స్వాగతం తెలుపుతున్న తెలంగాణ జర్నలిస్టు యూనియన్ . కాగా ఈ సమావేశాలు పద్మశాలి కళ్యాణమండపం, వెస్ట్ మారేడ్ పల్లీ సికింద్రాబాద్ లో జరుగనున్నాయి. టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ... జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ తో సంబంధం లేకుండా కొత్తజిల్లాల్లో ఒకే చోట ఇండ్లు ఇవ్వాలని.. హెల్త్ కార్డులు, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి నెల నెలకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు, చిన్న మరియు మధ్యతరహా పత్రికలకు, మగజైన్స్ లకు నెల నెల ప్రకటనలు ఇవ్వాలని మరియు ఇతర పలు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
Comments
Post a Comment